మొద్ద నిద్ర లేచి ఉద్దరిస్తున్నట్లు బాబు బిల్డప్‌

 నిమిషం వృథా కాకుండా పనిచేద్దాం

వైయస్‌ఆర్‌ సీపీ మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి

వైయస్‌ఆర్‌ జిల్లా: మొద్దు నిద్ర లేచి రాష్ట్రాన్ని ఉద్దరిస్తున్నట్లుగా చంద్రబాబు, ఆయన పార్టీ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. నవరత్నాలను కాపీ కొట్టి ఏదో చేస్తున్నట్లుగా ప్రభుత్వ డబ్బుతో పార్టీ ప్రచారాలు చేసుకుంటున్నారని మండిపడ్డారు.

పోస్ట్‌ డేటెడ్‌ చెక్కులు ఇచ్చి డ్వాక్రా మహిళల జీవితాలు మార్చినట్లుగా చెబుతున్నారు. ప్రజల్లో నిజాలు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. బూత్‌ కమిటీ సభ్యులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు వంచన గురించి వివరించాలి. 2014లో జిమ్మిక్కులతో చంద్రబాబు మోసం చేశాడన్నారు. నవరత్నాల పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ బూత్‌ కమిటీ సభ్యులకు దిశా నిర్దేశం చేస్తారన్నారు. మోసకారి చంద్రబాబును, తెలుగుదేశం పార్టీని ఎలా ఎదుర్కోవాలి, కుట్రలు, కుతంత్రాలను ఎలా ఛేదించాలి, మన ప్రభుత్వం ఏర్పడాలంటే మన కృషి ఎలా ఉండాలో వైయస్‌ జగన్‌ వివరిస్తారన్నారు. 

Back to Top