ద‌ళితుల‌కు  వైయ‌స్ జ‌గ‌న్  ఇచ్చిన‌న్ని ఇళ్లు ఏ సీఎం ఇవ్వ‌లేదు

వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు జూపూడి, మేరుగ‌, డొక్కా మాణిక్య వ‌ర‌ప్ర‌సాద్‌
 
రమ్య హత్య ఘటనలో ప్రభుత్వ చర్యల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన జాతీయ ఎస్సీ కమిషన్

 ఎస్సీ కులాల్లో ఎవరన్నా పుట్టాలనుకుంటారా అన్న బాబును నేషనల్‌ ఎస్సీ కమిషన్‌ కలిస్తే బాగుంటుంది. 

 టీడీపీ హయాంలో దళితులను అంటరానివాళ్ళుగా చూశారు 

 చంద్రబాబు లాక్కునన్ని దళితుల భూములు దేశ చరిత్రలోనే ఎవరూ లాక్కోలేదు.

  ఇప్పటికైనా బాబు నీచ రాజకీయాలు మానుకోవాలి 

 జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులను కలిసిన  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు 

గుంటూరు: దళితులకు ఇచ్చినన్ని ఇళ్ళస్థలాలు... ఇక మీదట కట్టబోయే ఇళ్ళు దేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రీ ఇవ్వలేద‌ని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు పేర్కొన్నారు. దళితులమీద ప్రభుత్వ దాడులకు చంద్రబాబే గ్యాంగ్‌ లీడర్‌! చంద్రబాబు లాక్కునన్ని దళితుల భూములు దేశ చరిత్రలోనే ఎవరూ లాక్కోలేద‌ని విమ‌ర్శించారు. గుంటూరులో జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులను కలిసిన అనంతరం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రభుత్వ సలహాదారు(సోషల్ జస్టిస్) జూపూడి ప్రభాకరరావు, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ ఛైర్మెన్ , ఎమ్మెల్యే మేరుగు నాగార్జున, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ మీడియాతో మాట్లాడారు. 

 
 ఎస్సీలమీద ప్రేమ అంటే దాని అర్థం... సహజంగా ఉండాలి. ముఖ్యమంత్రుల్లో ఎవరూ ఎస్సీలను కుటుంబాల పరంగా కానివ్వండి... వ్యక్తిగతంగా కానివ్వండి... దగ్గరకు తీసుకున్నారో అందరికీ తెలుసు. బాబు ఎస్సీల్లో ఎవరు పుట్టాలనుకుంటారని అంటే... "మంచి అన్నది మాల అయితే మాల నేనవుతానని" జగన్‌గారు అనేక సందర్భాల్లో కోట్‌ చేయటం జరిగింది. జగన్‌గారిది మనసునిండా ప్రేమ... చంద్రబాబుకు ఒక్క కులం తప్ప మిగతా వాళ్ళు మనుషులే కారు... పనివాళ్ళు, పగవాళ్ళు తప్ప! 

 రమ్య తల్లి ఏం మాట్లాడారో వినండి... రమ్య ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని నిందితుడిని గంటల్లోనే పట్టుకున్న కేసు. ఇది ప్రభుత్వం చేసిన హత్య కాదు... గతంలో ప్రభుత్వం చేసిన దళిత హత్యలన్నీ చంద్రబాబు చేయించినవే. గ్రామ బహిష్కరణలు, కారంచేడులు, మీకెందుకురా రాజకీయాలన్న వ్యాఖ్యలు... దళితులు స్నానం చేయరన్న వ్యాఖ్యలు... ఇవన్నీ చంద్రబాబు ఫ్యాక్టరీలో తయారయినవే. 

 వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డిగారు అధికారంలోకి రాగానే ఇచ్చిన 1.3 లక్షల ఉద్యోగాల్లో కానివ్వండీ... మొత్తంగా చేసిన ఉద్యోగ నియామకాల్లో కానివ్వండి... చివరికి ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్లు అమలు చేసిన ఏకైక ప్రభుత్వం జగనన్నది. 

  కేవలం 26 నెలల కాలంలో నేరుగా ఎసీ లబ్ధిదార్ల ఖాతాలకు డీబీటీ ద్వారా జగన్‌గారి ప్రభుత్వం ఇచ్చిన డబ్బు ఏకంగా రూ.17,014.24 కోట్లు. నాన్‌ డీబీటీ స్కీములైన ఆరోగ్యశ్రీ, జగనన్న తోడు, జగనన్న గోరుముద్ద, వైయస్సార్‌ సంపూర్ణ పోషణ, జగనన్న విద్యా కానుక, ఇళ్ళ పట్టాలు, కంటి వెలుగు ప్రోగ్రామల ద్వారా ఎస్సీలకు ఈ 26 నెలల పాలనలో కలిగిన లబ్ధి... రూ.7.153 కోట్లు. మొత్తంగా రూ.24,169 కోట్లు లబ్ధి కలిగింది. ఇటువంటి పాలన ఇంతకు ముందు  ఏనాడైనా చూశామా? 

 అయిదేళ్ళ బాబు పాలనలో ఎస్సీ సబ్‌ప్లాన్‌కు చేసిన ఖర్చు మొత్తంగా రూ.33,625 కోట్లు అయితే... ఈ జులై వరకు అంటే... 25 నెలల పాలనలో జగన్‌గారి ప్రభుత్వం ఎస్సీ సబ్‌ప్లాన్‌మీద చేసిన ఖర్చు ఏకంగా రూ. 32,925 కోట్లు. 

 ఎస్సీ కులాల్లో ఎవరన్నా పుట్టాలనుకుంటారా.. అనుకున్న వ్యక్తి హైదరాబాద్‌లో ఉన్నాడు... ఆయన్ను నేషనల్‌ ఎస్సీ కమిషన్‌ కలిస్తే బాగుంటుంది. 

  ఈ రోజు అగ్రీగోల్డ్‌ ప్రోగ్రాం ఉంది కాబట్టి, అందులోనూ 80 శాతం డబ్బు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే వెళుతుంది కాబట్టి  డైవర్షన్‌ కోసమే టీడీపీ ప్రయత్నం. 

 వైయ‌స్‌ జగన్‌గారు ఎప్పుడు ఏ ప్రోగ్రాం పెట్టినా.. ఏదో ఒక డైవర్షన్‌ కావాలని ప్రయత్నం. వ్యవస్థల మేనేజ్‌మెంట్‌లో దిట్ట కాబట్టి ఎవరినైనా దింపగలడు. ప్రజలు మాత్రం నమ్మటం లేదు. 

  సామాజిక న్యాయ చరిత్రలో ఇది సువర్ణ అధ్యాయం... 
– నవ రత్నాల్లో ప్రతి పథకం  ఎస్సీ ఎస్టీ వర్గాల బాగు కోరేదే. అమ్మ ఒడి, రైతు భరోసా, ఆరోగ్యశ్రీ, పెన్షన్ల పెంపు, 30లక్షల పక్కా ఇళ్ళు, గ్రామ/వార్డు వాలంటీర్ల వ్యవస్థ, పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆదరణ, చేయూత... ఇలా ఏ పథకం తీసుకున్నా వారికి అండదండలుగా నిలబడటమే ఈ ప్రభుత్వ ఎజెండా. 
– ప్రధానంగా ఇంగ్లీష్‌మీడియం, ప్రభుత్వ పాఠశాలల్లో నాడు–నేడు అన్నవి దేశంలోనే ఒక మహా విప్లవానికి అంటుకడుతున్నాయి.  
– సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా పేద వర్గాల కోసం నిలబడుతున్నాం.
– మంత్రివర్గంలో దాదాపు 60 శాతం పదవులు వెనుకబడిన వర్గాలకే.
– ఐదుగురు ఉప ముఖ్యమంత్రుల్లో నలుగురు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలవారే
– అధికారంలోకి వచ్చిన తరవాత 15 ఎమ్మెల్సీల్లో 11 ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకే. 
– డీబీటీ(నేరుగా బ్యాంకు ఖాతాల్లో డబ్బు వేసే) పథకాల్లో అత్యధికంగా లబ్ధిపొందినది నిరుపేద సామాజిక వర్గాలే. 
– దేశ చరిత్రలోనే రికార్డుగా 30 లక్షల ఇళ్ళ పట్టాల పంపిణీకి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇందులో అత్యధికంగా దక్కేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సామాజిక వర్గాలవారికే. 
– రానున్న రెండేళ్లలో దాదాపు 30 లక్షల ఇళ్ళ నిర్మాణానికి రంగం సిద్ధం చేస్తున్న ప్రభుత్వం ఇది.
– గ్రామ సెక్రెటేరియట్‌ ఉద్యోగాల్లో 83 శాతం దక్కినది బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకే. 
–చరిత్రలోనే తొలిసారి నామినేటెడ్‌ పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికే. అంతే కాకుండా మున్సిపల్‌ ఛైర్మన్లు, మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్లలో దాదాపు 50 శాతం వీరికే. 
– నామినేటెడ్‌ పోస్టుల్లో దాదాపు 58  శాతం పైగా వీరికే. 
– దేవాలయ ట్రస్టుబోర్డులు, వ్యవసాయ మార్కెటింగ్‌ కమిటీల వంటివాటిలో 50 శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలవారికే. 
– ఎస్సీ ఎస్టీలకు విడివిడిగా కమిషన్లు. మాల, మాదిగ, రెల్లి కులాలకు విడివిడిగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఇదే. 
– ప్రభుత్వ పథకాలన్నింటిలో అత్యధిక లబ్ధిదారులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే. 
 

 24 గంటలల్లోనే నిందితుడిని పట్టుకుని, అరెస్టు చేశాం: జూపూడి ప్రభాకరరావు   
మహిళలపై దాడులు, అత్యాచారాలకి పాల్పడిన వారిపై ఈ ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోంది. రమ్య హత్య కేసు నిందితుడికి కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. 24 గంటలల్లోనే నిందితుడిని పట్టుకుని, అరెస్టు చేశాం. గుంటూరులో హత్యకు గురైన రమ్య కుటుంబ సభ్యులను ప్రభుత్వం సత్వరమే ఆదుకుంది.  రమ్య కుటుంబ సభ్యులకు ప్రభుత్వం చేసిన సాయాన్ని ఎస్సీ కమిషన్ సభ్యులకు వివరించడం జరిగింది.  గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దళితులపై జరిగిన తీవ్ర అన్యాయాలను, అఘాయిత్యాలను కమిషన్ కు వివరించాం.

 రమ్య హత్య ఘటన తదనంతరం ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారు వేగంగా స్పందించిన తీరు, ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు తీసుకున్న చర్యలను ఎస్సీ కమిషన్ సభ్యులు ఈ సందర్భంగా మెచ్చుకొన్నారు. ప్రభుత్వ చర్యలపట్ల  జాతీయ ఎస్సీ కమిషన్ సంతృప్తి వ్యక్తం చేసింది. ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు  ఏ ప్రభుత్వాలూ ఇంతగా స్పందించలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  వేగంగా స్పందించి నాలుగు రోజుల్లోనే న్యాయం చేసిందని కమిషన్ అభిప్రాయపడింది. 

 రమ్య కుటుంబ సభ్యులకు చట్ట ప్రకారం న్యాయం చేయడం జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్ట ప్రకారం బాధిత కుటుంబానికి అందాల్సిన సాయాన్ని వారం రోజుల లోపలే అందించాం.
- రమ్య కుటుంబసభ్యులే ముఖ్యమంత్రి శ్రీ  వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారు న్యాయం చేశారని చెబుతున్నారు.

 ఈ ఘటనను ప్రతిపక్షాలు రాజకీయ లబ్ది కోసం వాడుకోవాలని చూస్తున్నాయి. ఇకనైనా చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలు మానుకోవాలి. ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారు దళిత పక్షపాతిగా ఉన్నారు.  వైయస్ జగన్ గారిది దళితులతో పెనవేసుకున్న కుటుంబం.

గత ప్రభుత్వం దళితులను అంటరానివాళ్లుగా చూసింది: మేరుగు నాగార్జున  
గత ప్రభుత్వం దళితులను అంటరానివాళ్లుగా చూసింది. రమ్య హత్యపై జగన్ మోహన్ రెడ్డిగారి నేతృత్వంలోని ప్రభుత్వం వేగంగా స్పందించి, వారి కుటుంబ సభ్యులకు న్యాయం చేసింది.  భారతదేశంలోనే ఇంత వేగంగా న్యాయం జరిగిన పరిస్థితి బహుశా ఎక్కడా జరగలేదు.  రమ్య కుటుంబానికి  ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయంతోపాటు, ఇంటి స్థలం పట్టా ఇవ్వడం జరిగింది.  అమరావతి రాజధాని ప్రాంతంలో దళితులకు ఇచ్చే ఇళ్లను సైతం అడ్డుకున్న చరిత్ర చంద్రబాబుది.  ప్రతిపక్ష నేత చంద్రబాబు రాష్ట్రంలో కులాలు, మతాలు, ప్రాంతాలను రెచ్చగొట్టాలని చూస్తున్నారు. సీఎం వై య‌స్ జ‌గ‌న్ గారి కుటుంబం దళితులకు అత్యంత చేరువుగా ఉండే కుటుంబం.

  దేశంలోనే మొదటి సారి: డొక్కా మాణిక్యవరప్రసాద్  
 రమ్య హత్య కేసులో.. 24 గంటల లోపల నిందితుడిని అరెస్ట్ చేసి, అంతే వేగంగా బాధిత కుటుంబానికి సాయం అందించడం భారతదేశంలోనే మొదటి సారి. రాష్ట్రం మొత్తం రమ్య ఘటనపై స్పందించారు.  ముఖ్యమంత్రి జగన్ గారు, వారందరి కంటే ముందే రాష్ట్ర చరిత్రలో లేని విధంగా రమ్య కుటుంబానికి న్యాయం చేశారు.  రాష్ట్రంలో మహిళలు, పేదలు, దళితులపై ఏ చిన్న ఘటన జరిగినా.. ముఖ్యమంత్రి గారు వేగంగా స్పందిస్తున్నారు.  భారత దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే, రాష్ట్రంలో దళితులపై జరిగిన ఘటనలపై సీఎం గారు స్పందిస్తున్న తీరును జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు కొనియాడారు. రమ్య కుటుంబానికి అండగా ఉన్న దళిత సంఘాలకు ధన్యవాదాలు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top