ప్రత్యేకహోదాపై మాట్లాడే నైతిక హక్కు టీడీపీకి లేదు...

 వైయస్‌ఆర్‌సీపీ నేత మల్లాది విష్ణు

విజయవాడ:ప్రత్యేకహోదాపై మాట్లాడే నైతిక హక్కు టీడీపీకి లేదని వైయస్‌ఆర్‌సీపీ నేత  మల్లాది విష్ణు అన్నారు. టీడీపీ,బీజేపీ,పవన్‌కల్యాణ్‌లు కలిసి 2014 ఎన్నికల్లో ఏపీకి ప్రత్యేకహోదా తీసుకువస్తామని ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు.ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు తీసుకువస్తామని చెప్పి  ప్రజలను వంచించారన్నారు.కేంద్ర ప్రభుత్వంపై వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టి ప్రత్యేకహోదాపై తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారన్నారు. ప్రజల్లో చులకన అయ్యామనే భయంతో కేంద్ర ప్రభుత్వం నుంచి చంద్రబాబు బయటకువచ్చారన్నారు.

ఎవరిని అడిగి ప్రత్యేకహోదాను ప్యాకేజీగా మార్చారని చంద్రబాబును ప్రశ్నించారు.ఎవర్ని అడిగి శాసనసభలో తీర్మానం చేశారో సమాధానం చెప్పాలన్నారు.ఎవర్ని అడిగి కేంద్రమంత్రికి సాలువాను కప్పి సన్మానాలు చేశారని ప్రశ్నించారు. ఏపీ ప్రజల అవసరాలను పక్కనపెట్టి,వారి హక్కులను కాలరాసి.. ఎన్నికల సమయంలో ధర్మపోరాట దీక్షలంటూ చంద్రబాబు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు.వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మొదటి నుంచి ఒకే స్టాండ్‌పై నిలబడి ప్రత్యేకహోదాపై నిరంతరం పోరాటం చేస్తున్నారన్నారు.హోదాతోనే ఆంధ్రరాష్ట్రం సర్వోతోముఖాభివృద్ధి చెందుతుందని చిత్తశుద్ధితో ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారన్నారు.

Back to Top