కోడి కత్తో.. నారా కత్తో తేలుతుంది

ఎన్‌ఐకే విచారణతో హత్యాయత్నం డొంక కదులుతోంది

భయంతోనే దావోస్‌ పర్యటన రద్దు చేసుకున్న చంద్రబాబు

నల్ల చొక్కా కాదు.. నల్లరంగు పులుముకున్నా ఎవరూ నమ్మరు

ప్యాకేజీ మంచిదని అసెంబ్లీలో ప్రధానిని, జైట్లీని పొగడలేదా?

వైయస్‌ఆర్‌ సీపీ పోరాటంతోనే హోదా సజీవం

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత మహ్మద్‌ ఇక్బాల్‌

హైదరాబాద్‌: ప్రతిపక్షనేత వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై డొంక అంతా కదులుతోందని పార్టీ సీనియర్‌ నేత మహ్మద్‌ ఇక్బాల్‌ అన్నారు. కోడికత్తి అని ఎగతాళి చేసి మాట్లాడిన టీడీపీ నేతలు మాట్లాడరని, కోడి కత్తో.. నారా కత్తో త్వరలో తేలుతుందన్నారు. ఎన్‌ఐఏ దర్యాప్తును అడ్డుకోవడం టీడీపీ దిగజారుడుతనమన్నారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇక్బాల్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షనేత హత్యాయత్నం కేసులో ఏపీ ప్రభుత్వం నిసిగ్గుగా వ్యవహరిస్తోందన్నారు. కేసును చంద్రబాబు, డీజీపీ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నారు. డీజీపీ ప్రకటనతో గరుడ ఫ్లెక్సీ, మడతలు లేని లెటన్‌ను సృష్టించారు కాబట్టే స్టేట్‌ పోలీసులు దర్యాప్తు చేస్తే నిజాలు నిగ్గు తేలవని హైకోర్టును ఆశ్రయించామన్నారు. సివిల్‌ ఏవియేషన్‌ యాక్టు ప్రకారం ఎయిర్‌పోర్టులో జరిగిన హత్యాయత్నం ఎన్‌ఐఏకి అప్పగించవచ్చని తెలిసినా చంద్రబాబు ప్రభుత్వం ఎన్నో అడ్డంకులు సృష్టించిందన్నారు. 

వైయస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నం వెనుక కుట్ర కోణం ఉందని, నిందితుడు శ్రీనివాసరావును ఎవరెవరు ప్రోత్సహించారో తేల్చాల్సి ఉందని ఎన్‌ఐఏ స్పష్టం చేసిందన్నారు. మొదటి చార్జిషీట్‌ మాత్రమే వేషిందని, సెక్షన్‌ 173 (8) సీఆర్‌పీసీ ప్రకారం సప్లిమెంటరీ చార్జిషీట్‌ వేయాల్సి ఉందన్నారు. డొంక కదులుతుందని తెలిసే చంద్రబాబు దావోస్‌ పర్యటన రద్దు చేసుకొని లోకేష్‌ను పంపించారన్నారు. చంద్రబాబు, లోకేష్‌లకు అత్యంత సన్నిహితుడు ఫ్యూజన్, రెస్టారెంట్‌ యజమాని హర్షవర్థన్‌చౌదరి నేరచరిత్ర కలిగిన శ్రీనివాసరావును ఎలా పనిలో పెట్టుకున్నాడనే దానిపై కూడా ఎన్‌ఐఏ విచారణ చేపడుతుందన్నారు. 

ఇన్ని అబద్ధాలు చెబుతున్న చంద్రబాబుకు మెడకాయ మీద తలకాయ ఉందా.. ఆ తలకాయలో మెదడు ఉందా అని ఇక్బాల్‌ ప్రశ్నించారు. పరిటాల రవి హత్య కేసులో చంద్రబాబు డిమాండ్‌ చేస్తే దివంత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి సీబీఐకి అప్పగించారన్నారు. ప్రతిపక్షనేతపై జరిగిన హత్యాయత్నం జరిగినప్పుడు కనీస బాధ్యత లేకుండా ముఖ్యమంత్రి వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. నాలుగున్నర సంవత్సరాలు హోదాను మట్టుబెట్టి బ్లాక్‌ షర్టు వేసుకొని చంద్రబాబు నిస్సిగ్గుగా మాట్లాడాడన్నారు. అసెంబ్లీలో ప్రత్యేక ప్యాకేజీ మంచిదని ప్రధాన మంత్రిని, అరుణ్‌ జైట్లీని పొగిడింది నిజం కాదా..? అని ప్రశ్నించారు. చంద్రబాబు నల్ల చొక్కా వేసుకోవడం కాదు.. మొహానికి నల్లరంగు పులుముకున్నా జనం నమ్మరన్నారు. ఓటుకు కోట్ల కేసు అడ్డంగా దొరికిపోయి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ పోరాటం వల్లే హోదా సజీవంగా ఉందన్నారు. 

Back to Top