టీడీపీ పాలనలో విలువలు పతనం

చంద్రబాబు నీచ రాజకీయాలు సిగ్గుచేటు..

తెలుగు జాతికి  క్షమాపణ చెప్పాలి

వైయస్‌ఆర్‌సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి

విజయవాడ: రాష్ట్రానికి ఆదర్శప్రాయంగా ఉండాల్సిన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు చర్యలు సిగ్గుచేటని వైయస్‌ఆర్‌సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. భారతదేశంలోనే ఆంధ్ర రాష్టానికి ప్రత్యేక స్థానం,గుర్తింపు ఉన్నాయని, దురదృష్టవశాత్తూ చంద్రబాబు పరిపాలన చూస్తే చాలా దారుణంగా ఉందన్నారు. డబ్బుతో కొనుగోలు చేసి రాజకీయ లబ్ధి పొందాలని చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.  నాలుగు సంవత్సరాల క్రితం ఓటుకు కోట్లు కేసు  బయటకొచ్చిందన్నారు. నేడు ఓటుకు కోట్లు కేసులో మరోసారి చంద్రబాబు దొరికిపోయారన్నారు.

ప్రజాస్వామ్యవాదులంతా సిగ్గుతో తలవంచుకునే పరిస్థితి అని అన్నారు. చంద్రబాబు తప్పును ఒప్పుకుని తెలుగుజాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌  చేశారు. టీడీపీ పాలనలో రాజకీయ విలువలు పతనమవుతున్నాయన్నారు.నోటుకు కోట్లు కేసులో సెబాస్టియన్,స్టీఫెన్‌సన్‌ల మధ్య బాబు ప్రస్తావన స్పష్టంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి జవాబుదారీతనంగా ఉండాలన్నారు.ఓటుకు నోటు కేసు దర్యాప్తు త్వరిగతగతిన పూర్తిచేసి నిగ్గు తేల్చాలన్నారు. ఓటుకు నోటు సంఘటనలో చంద్రబాబు గొంతేనని ఫోరెన్సిక్‌ స్పష్టం చేసిందన్నారు.

Back to Top