ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో చంద్ర‌బాబు..ఆత్మ‌విశ్వాసంతో వైయ‌స్ జ‌గ‌న్‌..

 26 కేసుల్లో స్టేలు తెచ్చుకున్న నీవు నీతివంతుడ‌వా

వైయ‌స్ జగ‌న్ పేరు చెప్పితే చంద్ర‌బాబుకు వ‌ణుకు

జేడీ లక్ష్మి నారాయణ చంద్రబాబు మనిషి

ఆ ముసుగు నేడు  తొలగిపోయింది

వైయ‌స్ఆర్‌సీపీ నేత ల‌క్ష్మిపార్వ‌తి

హైదరాబాద్‌: ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని వైయస్‌ఆర్‌సీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నంద‌మూరి ల‌క్ష్మి పార్వ‌తి ధ్వ‌జ‌మెత్తారు. ఓట‌మి భ‌యంతో చంద్ర‌బాబు ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డితే..వైయ‌స్ జ‌గ‌న్ ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్తున్నార‌ని అభివ‌ర్ణించారు. వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో మంగ‌ళ‌వారం ఆమె మీడియా స‌మావేశంలో మాట్లాడారు. జ‌ర‌గ‌బోయే  ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోతుందనే భయంతో చంద్రబాబు ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. 26 కేసుల్లో స్టేలు తెచ్చుకుని చంద్ర‌బాబు అన్ని వ్యవస్థలను మేనేజ్‌ చేసుకున్నాడర‌న్నారు. చంద్ర‌బాబు  అవినీతిలో కూరుకుపోయార‌ని మండిప‌డ్డారు.  నా అంతా నీతిమంతుడు లేడని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నాడని, అది ప్రజలు చెప్పాలన్నారు. చంద్రబాబు తనకు గురించి తను అతిగా పోగుడుకుంటున్నాడరన్నారు. చంద్రబాబు చేయించుకున్న సొంత సర్వేలో కూడా తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందని స్పష్టమవుతుందన్నారు. ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ ప్రభంజనం సృష్టించబోతుందని జాతీయ సర్వేలు తేటతెల్లం చేస్తున్నాయన్నారు.

వైయస్‌ఆర్‌సీపీ సానుభూతి పరుల 59 లక్షల ఓట్లను తొలగించి దిగజారుడు రాజకీయాలకు చంద్ర‌బాబు పాల్పడ్డారన్నారు.ప్రభుత్వం దగ్గర రహస్యంగా ఉండాల్సిన ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ప్రైవేట్‌ సంస్థకు అప్పగించడం దారుణమన్నారు. ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు అర్హుడు కాదన్నారు. ప్రజలందరూ చంద్రబాబు తీరును ప్రజలందరూ గ్రహించారన్నారు. చంద్రబాబు లాంటి సెల్ఫ్‌ డబ్బా కొట్టుకోనేవారిని చరిత్రలో మార్చలేమన్నారు. పూర్తిగా స్వార్థంతో నిండిపోయిన వారు, అవినీతిలో కూరుకుపోయిన వారు మాత్రమే సొంత డబ్బాలు కొట్టుకున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తప్పు చేసి ప్రతిపక్షంపై ఎదురుదాడి చేస్తున్నారన్నారు. చంద్రబాబు 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా, 40 సంవత్సరాలు అనుభవం అని చెప్పుకుంటున్న చంద్రబాబు గర్వంగా చెప్పుకునే  ఒక మంచి పని అయినా చేశారా అని ప్రశ్నించారు.

ప్రజలకు ఏమి చేయలేదనే పూర్తి ఆత్మరక్షణలో పడిపోయి ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మీద ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు.వైయస్‌ జగన్‌ను ఎన్ని ఇబ్బందులకు గురిచేసిన సొంత పార్టీ పెట్టి ఎవరూ మద్దతు లేకుండా,వ్యక్తిగతంగా తనపై తను నిలబడ్డారన్నారు.పూర్తి ఆత్మవిశ్వాసంతో వైయస్‌ఆర్‌సీపీని స్థాపించారన్నారు.ఏ పార్టీతో పొత్తు లేకుండా  ధైర్యంగా ముందుకు వెళ్తున్నారని తెలిపారు. 40 సంవత్సరాల సీనియర్‌ అని చెప్పుకోనే చంద్రబాబు ఎన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకున్నారో ప్రజలందరికి తెలుసునన్నారు. నాలుభై సంవత్సరాలు అనుభవ ఉందన్న చంద్రబాబు రాష్ట్రానికి ఏం చేశారని ప్రశ్నించారు. గత ఎన్నికలో పవన్‌కల్యాణ్‌ మద్దతు కోసం ఎలా పరుగులు పెట్టావో రాష్ట్ర ప్రజలందరికి తెలుసునన్నారు.మోదీని తిట్టి జైలుకు పంపిస్తామని చెప్పిన వ్యక్తి..మళ్లీ మోదీ కోసం పరుగులు పెట్టిన సంగతి అందరికి తెలుసునన్నారు.

ఎన్టీఆర్‌ స్థాపించిన తెలుగుదేశం పార్టీని కబ్జాచేసి ఆయన ప్రాణాలు తీశావని ఆగ్రహం వ్యక్తం చేశారు.చంద్రబాబు చరిత్ర చూస్తే దిగజారిన రాజకీయం తప్ప ఏమీలేదన్నారు. ఎనిమిదేళ్లు పరిపాలన కాలంలో కూడా 40 ప్రభుత్వ రంగ సంస్థలను మూతవేయించిన ఘన చరిత్ర చంద్రబాబుది అని  ధ్వజమెత్తారు.రుణాంధ్ర ప్రదేశ్‌గా చేసిన ఘనత చంద్రబాబుది అని ఆగ్రహం వ్యక్తం చేశారు.వరల్డ్‌బ్యాంకు జీతగాడు అని పేరుతెచ్చుకున్న చరిత్ర నీది అని ఎద్దేవా చేశారు.రైతులను కాల్చిచంపిన ఘనత నీది అని అన్నారు. వైయస్‌ జగన్‌ పాదయాత్ర విజయవంతంగా సాగుతుంటే ఆయనను చంపడానికి కూడా చంద్రబాబు ప్రయత్నించారని మండిపడ్డారు.

వైయస్‌ఆర్‌ హయాంలోనే ఐటి అభివృద్ధి జరిగిందన్నారు.రాష్ట్రంలో జరగని విధంగా భూ కుంభకోణాలు ఏపీలో జరిగాయ‌న్నారు. అనేక హత్యారాజకీయాలు చేశార‌ని,  వైయస్‌ఆర్‌సీపీకి చెందిన దాదాపు 25 మందిని హత్యచేసి ఒక కేసు కూడా లేకుండా మీ వారిని కాపాడుకున్నావ‌ని ధ్వ‌జ‌మెత్తారు.  రాజ్యాంగ విలువలకు చంద్ర‌బాబు పాతరేశారు.రాష్ట్ర ప్రజలను కాపాడాల్సిన ముఖ్యమంత్రి అరాచకాలు సృష్టిస్తున్నారని  మండిపడ్డారు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు అక్రమాలన్నీ బయటపడతాయన్నారు.రాజధాని కోసం భూములు సేకరించి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసుకుంటారన్నారు.జేడీ లక్ష్మి నారాయణ చంద్రబాబు మనిషి అని,ఆయన ముసుగు నేడు తొలగిపోయిందన్నారు.

Back to Top