‘బాబు డ్వాక్రా మహిళలను నిలువునా ముంచారు’

వైయ‌స్ఆర్‌సీపీ మహిళా నేత కొల్లి నిర్మలా కుమారి
 

 విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు డ్వాక్రా మహిళలను నిలువునా ముంచాడని వైయ‌స్ఆర్‌సీపీ మహిళా నేత కొల్లి నిర్మలా కుమారి విమర్శించారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సబ్‌ప్లాన్‌ నిధులను మళ్లించటం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ప్రజలకిచ్చిన ఒక్క హమీ అయినా నెరవేర్చారా బాబు అంటూ మండిపడ్డారు.

ప్రపంచంలో ఇలాంటి సీఎం ఎక్కడా లేరన్నారు. చంద్రబాబు మాటలు ఏ మహిళా నమ్మడం లేదన్నారు. చంద్రబాబుకు కాపీ కొట్టడం మాత్రమే తెలుసని పేర్కొన్నారు. ‘చంద్రబాబు ఖబర్ధార్‌.. జాగ్రత్త, నీకు గుణపాఠం చెప్పే రోజు త్వరలోనే ఉంద’ని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

 

Back to Top