అభివృద్ధి అంతా శంకుస్థాపనలకే పరిమితం

చంద్రబాబుకు మించిన అబద్ధాలకోరు మంత్రి కాలువ

శంకుస్థాపన రాళ్లు..సమాధి రాళ్లుగా మారబోతున్నాయ్‌

రాయదుర్గం వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డి

అనంతపురం:మంత్రి కాల్వ శ్రీనివాసులు అభివృద్ధి అంటూ అవినీతికి పాల్పడ్డారని వైయస్‌ఆర్‌సీపీ రాయదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డి మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడారు. రాయదుర్గం అభివృద్ధి శంకుస్థాపనలకే పరిమితమయిందన్నారు. మంత్రి కాలువ పేపర్‌పులిగా పేరొందారన్నారు.ఇసుక,మట్టి మాఫియా,కాంట్రాక్టర్లు,కమీషన్లు పేర్లతో దాదాపు ఆరు వందల కోట్లు అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు. శంకుస్థాపన రాళ్లు..సమాధిరాళ్లుగా మారునున్నాయన్నారు.అభివృద్ధి పేరుతో దోపిyî  చేశారన్నారు. బిటిపికి నీరు తెస్తున్నామని చెప్పి తొమ్మిది వందల ఆరవై మూడు కోట్లు మంజూరయినట్లు తెలిపారని,కాని భూ సేకరణకు నోటిఫికేషన్‌ కూడా ఇంతవరుకూ ఇవ్వలేదన్నారు. కల్యాణ మండపాలు,కమ్యూనిటీ హాలు అని చెప్పి శంకుస్థాపనలు చేశారే తప్ప ఎటువంటి అభివృద్ధి చేయలేదన్నారు.చంద్రబాబుకు మించిన అబద్ధాలకోరుగా కాలువ శ్రీనివాసులు తయారయ్యారన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top