చంద్రబాబు ఏపీని సర్వనాశనం చేశారు

ఒక్క అవకాశం ఇవ్వండి..జగన్‌ ప్రజలకు మంచి చేస్తారు..

చంద్రబాబు..ఎన్టీఆర్‌ నుంచి టీడీపీని లాక్కున్నారు

చంద్రబాబు మోసాలను ప్రజలు గమనిస్తున్నారు

ఎదుటివాడు బాగుంటే ఓర్వలేని మనస్తత్వం చంద్రబాబుది

వైయస్‌ఆర్‌సీపీ నేత మోహన్‌బాబు

విజయవాడ:చంద్రబాబు ఏపీని సర్వనాశనం చేశారని వైయస్‌ఆర్‌సీపీ నేత మోహన్‌బాబు మండిపడ్డారు. విజయవాడ వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో  మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.ప్రజల శ్రేయస్సు కోసమే వైయస్‌ జగన్‌ కృషి చేస్తున్నారన్నారు.వైయస్‌ఆర్‌సీపీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు.ఎన్టీఆర్‌కు విరోధి అయిన కాంగ్రెస్‌తో చంద్రబాబు జత కట్టారన్నారు.చంద్రబాబుది కుటుంబపాలన అని అన్నారు.చంద్రబాబు కంటే ముందు టీడీపీలో నేను ఉన్నానని..చంద్రబాబూ టీడీపీ నీది కాదన్నారు.చంద్రబాబు ఎన్టీఆర్‌ నుంచి టీడీపీని లాక్కున్నారన్నారు. చంద్రబాబు పునాది కాంగ్రెస్‌ అని అన్నారు.ఓటుకు నోటు కేసులో  చంద్రబాబు రెడ్‌హ్యాండెడ్‌గా దోరికిపోయారన్నారు.బాబు మోసాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఎంతసేపు వైయస్‌ జగన్‌పై నిందలు వేస్తావు తప్ప..నీ పక్కనున్న దొంగలు గురించి మాట్లాడవే అని చంద్రబాబును ప్రశ్నించారు.నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి.ఇంకా విచారణకు రాకుండా ఎందుకు అడ్డుకున్నావు. అన్ని కేసుల్లోనూ ఎందుకు స్టేలు తెచ్చకున్నావు. నీవు దొంగవి కాదా అని ఆగ్రహం వ్యక్తం చేవారు. ఎదుటివాడు బాగుంటే ఓర్వలేని మనస్తత్వం చంద్రబాబుదన్నారు. చంద్రబాబుకి వ్యక్తిత్వం లేదన్నారు.

ఒక నటుడుగా,నిర్మాతగా లంచం అనే పదానికి అర్థం తెలియని,నిద్రహారాలు మాని కష్టపడి రోడ్లుపై తిరిగి తెలుగువాడి పౌరుషం నిరూపించిన మహానటుడు ఎన్టీఆర్‌ది తెలుగుదేశం పార్టీ అని అన్నారు.అక్రమంగా తెలుగుదేశం పార్టీని చంద్రబాబు లాక్కున్నారని తెలిపారు. చంద్రబాబు..ఎన్టీఆర్‌ ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్‌ వద్ద తాకట్టు పెట్టారన్నారు. హరికృష్ణకు చంద్రబాబు ఏం చేశారో ఇప్పటికైనా చెప్పాలన్నారు. మోదీ ఆంధ్రాకు వస్తే బేడీలు వేస్తానన్న చంద్రబాబు..ఎందుకు జతకట్టారని ప్రశ్నించారు.వైశ్రాయ్‌ హోటల్‌ వద్ద ఎన్టీఆర్‌ మీద చెప్పులు వేయించడం నాకు తెలుసునన్నారు.పసుపు–కుంకుమ డబు ప్రజలదేనని.మీ డబ్బే మీకు ఇస్తున్నారన్నారు.చంద్రబాబు ప్రత్యేకహోదా ఇవ్వలేకపోయిన పర్వాలేదని ప్రత్యేక ప్యాకేజీ ముద్దు అని అన్నారని,ఆ తర్వాత యూటర్న్‌ తీసుకున్నారన్నారు.వైయస్‌ జగన్‌ ప్రత్యేకహోదా కావాలని ఒకే మాటపై నిలబడ్డారన్నారు.చంద్రబాబు రాష్ట్రంలో ఇసుక,మట్టి అన్ని దోచుకున్నారన్నారు.చంద్రబాబు మాటలు నమ్మితే నట్టేట మునిగినట్లేనన్నారు.చంద్రబాబుకు నీతి,ధర్మం,న్యాయం లేదన్నారు.చంద్రబాబును నమ్మొద్దని ప్రజలకు సూచించారు. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు మంచి చేస్తారని ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు

Back to Top