విశాఖ డివిజన్‌ సాధనకు పోరాటం

వైయస్‌ జగన్‌ పోరాట ఫలితమే విశాఖకు రైల్వేజోన్‌

చంద్రబాబును ప్రజలంతా బందిపోటుగా చూస్తున్నారు

ఎన్నికలు దగ్గరపడ్డాయని నల్లచొక్కాలతో టీడీపీ కొత్త డ్రామాలు

లోకేష్‌ వైద్య పరీక్షలు చేయించుకుంటే మంచిది

తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల్లో బంగాళాఖాతంలో కలవడం ఖాయం

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత గుడివాడ అమర్‌నాథ్‌

విశాఖపట్నం: వాల్తేరు డివిజన్‌ను విశాఖ రైల్వేజోన్‌లో కలిపేంత వరకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాటం ఆగదని పార్టీ సీనియర్‌ నేత గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. ఎన్నికల సమయం వచ్చే సరికి ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై చంద్రబాబు బురదల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. లోకేష్‌ ఒకసారి వైద్యులకు చూపించుకుంటే మంచిదన్నారు. రూ. 6 వేల కోట్ల ప్రజాధనాన్ని దుబారా చేసిన చంద్రబాబును ప్రజలంతా బందిపోటులా చూస్తున్నారన్నారు. 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు వ్యాఖ్యలు చూసి ప్రజలంతా ముక్కున వేలేసుకుంటున్నారన్నారు. విశాఖపట్నం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో గుడివాడ అమర్‌నాథ్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. 

ఐదేళ్ల కాలంలో చంద్రబాబు ఏరకమైన పాలన చేశారో.. ఏ రకమైన దోపిడీ చేశారో.. ప్రజల తాలూకా విశ్వాసాన్ని పోగొట్టుకున్నారో.. రాష్ట్రంలోని ప్రజల తాలూకా మనోభావాలను, ఆలోచనలను కాలరాశారో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామని తెలుసుకొని సంస్కారంతో ఆలోచన చేసి మాట్లాడాలి. చంద్రబాబు, లోకేష్‌ మాటలు విన్ని ప్రజలు నవ్వుకుంటున్నారు. 

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తున్నారే ప్రకటన వచ్చిన తరువాత, లోటుపాట్లు అన్ని వైయస్‌ఆర్‌ సీపీ ఎత్తిచూపింది. జరిగిన అన్యాయానికి వైయస్‌ జగన్‌ కారణం అని లోకేష్‌ మాట్లాడుతున్నాడు. లోకేష్‌కు  ఏమైనా ఆలోచన ఉందా..?  

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆరు నెలల్లో రైల్వేజోన్‌ ఇవ్వాలి. రైల్వేజోన్‌ గురించి చంద్రబాబు ఏ ఒక్కరోజైనా పోరాటం చేశారా..? కేంద్రాన్ని నిలదీసే ప్రయత్నం చేశారా..? వైయస్‌ జగన్‌ పోరాటం వల్లే రైల్వేజోన్‌ ప్రకటన వచ్చింది. వాల్తేరు డివిజన్‌ పూర్తిగా విశాఖపట్నం రైల్వేజోన్‌లో కలపాలని వైయస్‌ఆర్‌ సీపీ డిమాండ్‌ చేస్తుంది. 

టీడీపీ ఎంపీలు రాయపాటి సాంబశివరావు, గల్లా జయదేవ్‌ రాసిన లేఖలు చంద్రబాబు పరిశీలించుకోవాలి. విజయవాడ, గుంటూరు, గుంతకల్లులో రైల్వేజోన్‌ ఏర్పాటు చేయండి అని మాట్లాడిన సందర్భాలు గుర్తులేవా..? రాష్ట్రంలో ఉన్న టీడీపీ, కేంద్రంలోని బీజేపీతో నాలుగేళ్లు సంసారం చేసింది  మర్చిపోయారా..? కేంద్రమంత్రులుగా కొనసాగిన టీడీపీ ఎంపీలు ఏరోజైనా రైల్వేజోన్‌ గురించి నిలదీసిన సందర్భాలు ఉన్నాయా..? వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న ఉద్యమాలను హేళన చేసి మాట్లాడారు. మా నాయకుడు వైయస్‌ జగన్‌ అసెంబ్లీలో నల్లచొక్కాలు వేసుకొని నిరసన తెలియజేస్తే అవహేళన చేశారు. మరో రెండు నెలల్లో ఎన్నికలు ఉన్నాయనగా చంద్రబాబు నల్లచొక్కాలు వేసుకొని ఊరూరు ఊరేగుతే ప్రజలు ఎవరూ విశ్వసించరు. ఏరకంగా కేసుల నుంచి బయటపడాలనే ఆలోచన తప్పితే రాష్ట్రం గురించి ఏరోజు చంద్రబాబు ఆలోచించలేదు. మొన్నటి వరకు బీజేపీ, టీడీపీ సరైన జోడి అని, ఇప్పుడు యుద్ధమని మాట్లాడుతున్నారు. 

కనీస పరిజ్ఞానం లేకుండా చంద్రబాబు, లోకేష్‌ మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీ మునిగిపోయే నావా లాంటి పార్టీ, టీడీపీ బంగాళాఖాతంలో కలిసిపోయే రోజు దగ్గరలోనే ఉన్నాయి. పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్న లోకేష్‌ డాక్టర్‌ దగ్గరకు వెళ్లి చూపించుకోవాలి. వందలాది కోట్లతో హైదరాబాద్‌లో విలువైన ఇల్లు, కరకట్ట మీద లింగమనేని ఫాంహౌస్‌ తప్ప సొంత రాష్ట్రంలో ఒక్క శాశ్వతం నిర్మాణమైనా కట్టుకున్నారా..? రాష్ట్రంపై చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే నారావారి పల్లెలో ఉండాలి. సొంతం కాని ఇంట్లో ఉంటూ తాత్కాలిక భవనాలు కడుతూ వైయస్‌ జగన్‌ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు, లోకేష్‌కు లేదు. 

హైదరాబాద్‌లో అర్ధరాత్రి దొంగల్లా చంద్రబాబు గృహప్రవేశం చేశారు. మీ పార్టీ నాయకులను పిలుచుకొని కనీసం టీ అయినా ఇచ్చారా..? వైయస్‌ జగన్‌ వైయస్‌ఆర్‌ నాయకులు, కార్యకర్తలందరినీ పిలుచుకొని కుటుంబ సభ్యుల్లా భాగస్వాములను చేసి గృహప్రవేశం చేశారు. గృహప్రవేశం చేసిన మరుక్షణం రైల్వేజోన్‌ వచ్చింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత జరిపిన పుష్కరాల్లో 29 మంది చనిపోతారు. శుభసూచికమైన పనులు ఒక్కటైనా చేశారా..? చంద్రబాబును రాష్ట్ర ప్రజలను బందిపోటులా చూస్తున్నారు. 

Back to Top