హంతకుడు శాంతియాత్ర చేసినట్లుగా బాబు వైఖరి

తెలుగుదేశం పార్టీకి రోజులు దగ్గరపడ్డాయి

2015లోనే నల్లచొక్కా వేసుకొని వైయస్‌ జగన్‌ నిరసన తెలిపారు

ఈబీసీ రిజర్వేషన్‌ ఆర్డినెన్స్‌ అంటూ మరో కుట్రకు తెర

కాపులను చిత్రహింసలు పెట్టింది చంద్రబాబు సర్కార్‌

పసుపు – కుంకుమ పేరుతో డ్వాక్రా మహిళలపై కపట ప్రేమ

వైయస్‌ జగన్‌తోనే ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధ్యం

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత గుడివాడ అమర్‌నాథ్‌

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీకి రోజులు దగ్గరపడ్డాయని, త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీని దేవుడు కూడా కాపాడలేడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. ప్రత్యేక హోదాను మొదటి నుంచి చంపుతూ వస్తున్న చంద్రబాబు ఇప్పుడు నల్లచొక్కా వేసుకొని నిరసన తెలపడం చూస్తుంటే హత్య చేసిన హంతకుడే రోడ్డు మీదకు వచ్చి శాంతియాత్ర చేసినట్లుగా చంద్రబాబు వైఖరి ఉందని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో గుడివాడ అమర్‌నాథ్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 40 ఏళ్లలో ఎప్పుడూ నల్లచొక్కా వేయలేదంటూ చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంజీవని అని ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2015లోనే నల్లచొక్కా వేసుకొని నిరసన తెలిపారన్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్నాయని ఇప్పుడు చంద్రబాబు నల్లచొక్కా వేసుకొని బిల్డపులు ఇస్తున్నాడని మండిపడ్డారు. చంద్రబాబుకు అప్పుడు ఎందుకు నోరుపెకల లేదు. ఎందుకు కేంద్రంపై పోరాటం చేయలేదని ప్రశ్నించారు. 

రాష్ట్రానికి ఏది సాధించాలన్నా అది వైయస్‌ జగన్‌తోనే సాధ్యమని గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. రాష్ట్రంలోని 25 పార్లమెంట్‌ స్థానాలను వైయస్‌ఆర్‌ సీపీకి అందిస్తే ప్రత్యేక హోదా ఫైల్‌పై సంతకం పెట్టే పార్టీకే మద్దతు ఇస్తామని వైయస్‌ జగన్‌ స్పష్టంగా చెప్పారన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి వర్గానికి మేలు చేస్తామన్నారు. నాలుగున్నరేళ్లుగా ప్రజలను పీడిస్తున్న చంద్రబాబును మరోసారి నమ్మితే మనల్ని మనం ఉరివేసుకున్నట్లేనన్నారు. 

తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్ష సమావేశంలో కాపులకు ఈబీసీ కోటాలో 5 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తున్నట్లు, ఆర్డినెన్స్‌ తీసుకురాబోతున్నట్లుగా చంద్రబాబు లీకులు ఇస్తూ మరోసారి మోసం చేయాలని కుట్ర చేస్తున్నాడన్నారు. ఆర్డినెన్స్‌ పాస్‌ చేస్తున్నట్లుగా నమ్మించి రాష్ట్రపతి, గవర్నర్‌ల చెంత ఫైల్‌ పెండింగ్‌లో ఉందంటూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తారన్నారు. ఇంకా చంద్రబాబును ప్రజలు ఎలా నమ్ముతారని అనుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు. గతంలో చంద్రబాబు హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ విషయంలో కూడా ఇలాంటి తంతు జరిగిందన్నారు. పేరుకు పచ్చమీడియాను అడ్డుపెట్టుకొని లీకులు ఇస్తూ పెద్ద పెద్ద హెడ్డింగ్‌ల పెట్టించి వార్తలు ప్రచురించుకోవడం, తరువాత మా పనైపోయింది. అది కేంద్రం చేతుల్లో ఉందని చేతులు దులుపుకోవడం చంద్రబాబుకు అలవాటన్నారు. 

కాపులను బీసీల్లో చేర్చుతామని 2014 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత అనేక రకాలుగా మాటలు మార్చారని గుడివాడ అమర్‌నాథ్‌ గుర్తు చేశారు. నాలుగున్నరేళ్లుగా కాపులు చంద్రబాబును నమ్మిమోసపోతున్నారన్నారు. మరో నెలలో ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తుందనగా 5 శాతం ఈబీసీ కోటాలో రిజర్వేషన్‌ అంటూ కొత్త డ్రామాకు తెరతీశారన్నారు. నాలుగున్నరేళ్లుగా కాపులను బీసీల్లో చేర్చాలని పోరాటాలు చేస్తే చంద్రబాబు పోలీసులను అడ్డుపెట్టుకొని వారిని చిత్రహింసలు పెట్టారన్నారు. కాపుల రిజర్వేషన్‌పై వేసిన మంజునాథన్‌ కమిటీపై చంద్రబాబుకు గౌరవం ఉందా అని ప్రశ్నించారు. గతంలో రాత్రికి రాత్రి కేబినెట్‌ సమావేశం ఏర్పాటు చేసి కాపులను బీసీలుగా చేర్చుతామని చెబుతూ కేంద్రానికి రిపోర్టు పంపుతున్నామని బిల్డపులు ఇచ్చిన చంద్రబాబు.. తరువాత అనేక కుంటిసాకులు చెప్పారన్నారు. నిజంగా కాపులపై అభిమానం ఉంటే మోసం జరిగి ఉండేది కాదన్నారు. 

పసుపు– కుంకుమ పేరుతో మరోసారి డ్వాక్రా మహిళలను మోసం చేయడానికి చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. రూ. 10 వేలు ఉచితంగా ఇస్తున్నామని నారా లోకేష్‌ చెబుతున్నారు కానీ.. జీఓ విడుదల చేశారా..? అని ప్రశ్నించారు. పసుపు – కుంకుమ పేరుతో చంద్రబాబు ఇచ్చే రూ. 10 వేలు అప్పుగానే మిగిలిపోతుందని డ్వాక్రా మహిళలు గుర్తించాలన్నారు. మరో నెల రోజుల్లో నోటిఫికేషన్‌ వస్తుందనగా ఇప్పుడు రూ. 2500 ఇస్తామంటున్నారని, మరోసారి డ్వాక్రా మహిళలను మోసం చేయాలని చూస్తున్నారన్నారు. గతంలో చంద్రబాబు ఇచ్చిన రూ. 3 వేలు చూసుకోవడానికి తప్ప తీసుకోవడానికి లేకుండా చేశారన్నారు. కాపులు, డ్వాక్రా మహిళలు చంద్రబాబు ఎక్కడ కనిపించినా నిలదీయాలన్నారు. బాబు మోసపు హామీలు నమ్మి మోసపోయిన నిరుద్యోగులు, రైతులు, కుల సంఘాలు, చేతి వృత్తులవారు, విద్యార్థులు అందరూ ఓటుతో చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. 

 

తాజా వీడియోలు

Back to Top