అక్షరజ్ఞానం లేని వ్యక్తి లోకేష్‌

వైయస్‌ఆర్‌ సీపీ హిందూపురం ఎంపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్‌

పెనుగొండ: అక్షర జ్ఙానం లేని లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేయాలని చంద్రబాబు ఆరాటపడుతున్నాడని హిందూపురం పార్లమెంట్‌ నియోజకవర్గ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గోరంట్ల మాధవ్‌ అన్నారు. ఓనమాలు రాని లోకేష్‌ ముఖ్యమంత్రి అయితే.. చట్టం తెలిసిన వ్యక్తిని, రౌడీలను ఒంటి చేత్తో గడగడలాడించిన నేను ఎంపీ కాకూడదా అని ధ్వజమెత్తారు. పెనుగొండ నియోజకవర్గ వైయస్‌ఆర్‌ సీపీ ప్రచార సభను సోమందేపల్లిలో నిర్వహించారు. బహిరంగ సభలో ఎంపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్‌ మాట్లాడుతూ.. లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేయాలనే భావనలో చంద్రబాబు ఉన్నాడని, అక్షర పరిజ్ఞానం కూడా లేని వ్యక్తి ముఖ్యమంత్రి అయితే తాను ఎంపీ కాకూడదా చంద్రబాబూ అంటూ ప్రశ్నించారు. లా చదువుకొని, సక్సెస్‌ ఫుల్‌ పోలీసు ఆఫీసర్‌గా పనిచేశానని చంద్రబాబుకు సూచించారు. తాను ఎంపీ కాకూడదనే దురుద్దేశంతో చంద్రబాబు ఇంతకాలంలో తనను ప్రజల్లోకి రానివ్వకుండా ఏరకంగా అడ్డుకున్నారో ప్రజలంతా చూశారన్నారు. బడుగు, బలహీనవర్గాలు ఏకతాటిపైకి వచ్చి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు మనమంతా కృషిచేయాలని ప్రజలను కోరారు. 

 

Back to Top