ప్రత్యేకహోదా సాధనే వైయస్‌ఆర్‌సీపీ లక్ష్యం

కార్యకర్తలంతా గెలుపే ధ్యేయంగా పనిచేయాలి

వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌నేత ధర్మాన ప్రసాదరావు

శ్రీకాకుళం: వైయస్‌ఆర్‌సీపీ గెలుపుకు ప్రతి కార్యకర్త శ్రమించాలని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత ధర్మాన ప్రసాదరావు అన్నారు.పలాస ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. వైయస్‌ఆర్‌సీపీకి మీడియా లేదని,మన నోరే ఆయుధంగా వాడి గెలుపునకు కృషిచేయాలన్నారు.పార్లమెంటు అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాస్‌ పోటీ చేస్తున్నారని, ఆయనను గెలిపించాలని కోరారు.కార్యకర్తలంతా ఐక్యతతో పార్టీ గెలుపునకు కృషిచేయాలన్నారు. రాష్ట్రం నుంచి  25 మంది వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు ఢిల్లీకి వెళ్ళాలన్నారు.రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించడమే వైయస్‌ఆర్‌సీపీ లక్ష్యమని తెలిపారు.గురుతర బాధ్యతను నెరవేర్చడానికి అందరూ కష్టపడి పనిచేయాలన్నారు.వైయస్‌ఆర్‌సీపీ వర్ధిలాలని,వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నాయకత్వం వర్ధిలాలని నినాదాలు చేశారు.

Back to Top