వైయస్‌ వివేకానందరెడ్డి హత్యపై సీబీఐ దర్యాప్తు జరపాలి

సిట్‌పై నమ్మకం లేదు..

హత్య రాజకీయాలకు చంద్రబాబు ప్రోత్సహం

చేసిన తప్పేనే చంద్రబాబు మళ్ళీ చేస్తున్నారు.

వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత ధర్మాన ప్రసాదరావు

హైదరాబాద్‌: ప్రధాన ప్రతిపక్ష నాయకుడి కుటుంబానికి చెందిన వైయస్‌ వివేకానందరెడ్డిని దారుణంగా హత్య చేయడం దుర్మార్గమని వైయస్‌ఆర్‌సీపీ నేత ధర్మాన ప్రసాదరావు అన్నారు.ఆయన హైదరాబాద్‌ వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వైయస్‌ వివేకానంద రెడ్డి ఎంతటి మంచి వ్యక్తో ఈ రాష్ట్రంలోని పౌరులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదన్నారు.చాలా అరుదైన గొప్ప మనసు కలిగిన వ్యక్తుల్లో వైయస్‌ వివేకానంద రెడ్డి ఒకరని తెలిపారు.నేను మంత్రిగా ఉన్న రోజుల్లో ఆయన పార్లమెంట్‌ సభ్యుడిగా ఉన్నారని, అతి సాధారణ వ్యక్తిగా సెక్రటేరియట్‌కు వచ్చేవారన్నారు.ఆయన జిల్లా నుంచి పౌరులను తీసుకువచ్చి వారి సమస్యలను పరిష్కరించేవారని గుర్తు చేశారు. తనొక్క ముఖ్యమంతి సోదరుడినని గాని, రాజకీయ ప్రతినిధిని అని కాని, ఎలాంటి అహం లేని గొప్ప మనస్తత్వం కలిగినవారన్నారు.ౖ వెయస్‌ వివేకానందరెడ్డికి శత్రువులు లేరన్నారు. ఎదుటివారిని  ప్రేమించి వారి కష్టనష్టాలను తీర్చే వారని అన్నారు.

వైయస్‌ వివేకానందరెడ్డి కాపలాదారులు కూడా లేకుండా ఒంటరిగా ఇంట్లో నిద్రపోతున్నారంటే..ఎవరూ శత్రువులు లేరనే  గొప్ప నమ్మకమే కాదా అని అన్నారు.రాయలసీమ వంటి ప్రాంతంలో సుదీర్ఘ పదవులు నిర్వహించి,కాపలా దారులు కూడా లేకుండా ఉన్నారంటే ఆయన ఎటువంటి వ్యక్తో చెప్పవచ్చన్నారు.అజాత శత్రువు, గొప్ప వ్యక్తి, ఎవరితో వివాదాలు లేని వ్యక్తి హత్య గావింపబడ్డారంటే ఎవరికి అవసరం ఉంటుందని ప్రశ్నించారు.ఎవరికి అవకాశం ఉంటుందనే విషయాన్ని ఈజీగా రాష్ట్రంలో సాధారణ పౌరులు కూడా అంచనాకు రాగాలని నమ్ముతున్నాన్నారు.వైయస్‌ఆర్‌ జిల్లాలో ఎన్నికలను ప్రభావితం చేయగల వ్యక్తి వివేకానందరెడ్డి అని అన్నారు. వైయస్‌ వివేకానందరెడ్డికి వ్యాపార లావాదేవీలు, గొడవలు లేవన్నారు.ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన తప్పునే మళ్లీ చేస్తున్నారని మండిపడ్డారు.హత్యను విచారణ చేయాల్సిన అధికారులకు చంద్రబాబు గైడెన్స్‌ ఇస్తున్నారని దయ్యబట్టారు.ప్రతి సందర్భంలోనూ చేసిన పనే ఈ చంద్రబాబు మళ్లీ చేస్తున్నారన్నారు.చివరకు రాజధానిలో అరటితోటలను కాల్చివేసిన ఘటనను వైయస్‌ఆర్‌సీపీపై నెట్టేశావన్నారు.పట్టిసీమ గట్టు కొట్టేస్తే వైయస్‌ఆర్‌సీపీపై నెట్టేశావు.

వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి శాసనసభలో ఉంటే కార్యాలయంలో వర్షపు నీరుపారితే వైయస్‌ఆర్‌సీపీపైకి నెట్టేశావు.కాపు ఉద్యమంలో రైలును తగలపెట్టేతే వైయస్‌ఆర్‌సీపీపైకి నెట్టేశావు.నాలుగున్నర సంవత్సరాలుగా ఏ సంఘటన జరిగిన వైయస్‌ఆర్‌సీపీపైకి నెట్టేస్తున్నావని మండిపడ్డారు. వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి టార్గెట్‌గా విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.ప్రజలను నమ్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నావన్నారు. దారుణ హత్య జరిగి రాష్ట్రమంతాట ఉలిక్కిపడితే..దానిని చిన విషయంగా పక్కదారి పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.హత్య జరిగి 24 గంటలు దాటుతున్న విచారణలో సీరియస్‌నెస్‌ ఏదీ అని ప్రశ్నించారు.విచారణ ఏమి చేయాలనేది చంద్రబాబు మాటల ద్వారానే స్పష్టమయిందన్నారు.చంద్రబాబు సిట్‌ను డిపార్ట్‌మెంటే అపఖ్యాతి పాలు చేసేవిధంగా తయారుచేశారన్నారు.వాస్తవాలు బయటకు రాకుండా సిట్‌ను నీ గుప్పింట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తారన్నారు.మసిపూసి మారేడుకాయ చేసి చివరికి దొంగ రిపోర్ట్‌ ఇస్తారని  ధ్వజమెత్తారు.చంద్రబాబు వేస్తున్న సిట్‌ల వెనుక సారాంశం ఏమిటనేది రాష్ట్రంలో ప్రజలందరికి తెలిసిపోయందన్నారు.సిట్‌ అని అన్నారంటే మీపై అనుమానం ఏర్పడుతుందన్నారు. సిట్‌ పరువు చేసి,నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.డిపార్‌మెంట్‌పైనే నమ్మకంలేకుండా చేశారన్నారు.కొన్ని కేసులు సీబీఐ విచారణ చేయవచ్చని సుప్రీంకోర్టు మార్గ దర్శకాలు ఇచ్చిందన్నారు.

రాష్ట్ర పరిధిలో అధికారులు నిష్ఫాక్షపాతంగా దర్యాప్తు చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు కోర్టు ఆదేశాలు జారీ చేయవచ్చన్నారు.రాష్ట్రంలో నిష్పాక్షపాతంగా అధికారులు దర్యాప్తు చేసే పరిస్థితి లేదన్నారు.వారు ఏమి చేయాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పేస్తున్నారని ధ్వజమెత్తారు.చంద్రబాబు క్రూరంగా మాట్లాడిన సందర్భాలు అనేకం ఉన్నాయని,ఎలా ముఖ్యమంతి అవుతారో చూస్తాం, ఫినిష్‌ చేస్తాం అంటూ వ్యాఖ్యలు చేశారని గుర్తుచేశారు.వైయస్‌ వివేకానందరెడ్డి ప్రచారం చేస్తే తెలుగుదేశం పార్టీకి అడ్రాస్‌లు ఉండవనే భయంతోనే దుశ్చర్యకు పాల్పడ్డారన్నారు.వైయస్‌ఆర్‌ కుటుంబాన్ని ఫినిష్‌ చేయాలనే ఉద్దేశ్యంతో చంద్రబాబు హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు.  సీబీఐ విచారణ చేయించి వైయస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో చంద్రబాబుకు  సంబంధంలేదని  నిరూపించుకోవాలన్నారు.వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం జరిగితే కోడి కత్తి అని చంద్రబాబు,మంత్రులు హేళన చేశారన్నారు.టీడీపీ ప్రభుత్వం కాలం చెల్లిందని, కోడ్‌ అమలులోకి వచ్చిందని ఈ నేపథ్యంలో చంద్రబాబు విచారణ గురించి మాట్లాడం పద్దతి కాదన్నారు.సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని డిమాండ్‌ చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top