పొత్తుల పేరుతో చంద్రబాబు అసత్య ప్రచారం

రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఫెడరల్‌ ఫ్రంట్‌తో చర్చలు
 

చంద్రబాబు డ్రామాల వల్లే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదు
 

వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు

శ్రీకాకుళం:  పొత్తుల పేరుతో చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. వైయస్‌ఆర్‌సీపీకి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఫెడరల్‌ ఫ్రంట్‌తో చర్చలు జరిపామని చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..చంద్రబాబు డ్రామాల వల్లే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదని ఆయన విమర్శించారు. రాష్ట్ర హక్కుల కోసం వైయస్‌ జగన్‌ నాలుగేళ్లుగా పోరాడుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ నేత ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. పార్లమెంట్‌లో చట్టం చేసినా ప్రత్యేక హోదా ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు.

ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల కోసం పోరాడుతూనే ఉన్నామన్నారు. పార్లమెంట్‌లో ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. చంద్రబాబు నాలుగేళ్లు కేంద్రంతో అంటకాగి హోదాను నీరుగార్చారని విమర్శించారు. హోదా వద్దు..ప్యాకేజీ కావాలని చంద్రబాబు అనలేదా అని ప్రశ్నించారు. పార్లమెంట్‌లో ఇచ్చిన హామీలకే దిక్కులేకపోతే ..ఎవరిని ప్రశ్నించాలని ఆయన నిలదీశారు.వైయస్‌ఆర్‌సీపీ ఎవరితో పొత్తు పెట్టుకోదని, ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తుందని చెప్పారు.  వైయస్‌ఆర్‌సీపీకి ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలే ముఖ్యమన్నారు. 
 

Back to Top