విజయవాడ: అరాచకాలు, విధ్వంసాలు సృష్టించడంలో లోకేష్ తండ్రికి తగ్గ తనయుడిగా వ్యవహరిస్తున్నాడని విజయవాడ తూర్పు నియోజకవర్గ వైయస్ఆర్ సీపీ ఇన్‌చార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. గొడవల పేరుతో రాజకీయాల్లో ఒక నూతన ఒరవడిని లోకేష్ మొదలుపెట్టాడని, రౌడీషీటర్లు, గూండాలను తయారు చేసే ఫ్యాక్టరీలా టీడీపీని లోకేష్ మార్చాడన్నారు. రౌడీయిజం, గూండాయిజం, అల్లర్లు చేస్తే పదవులిస్తానని సిగ్గులేకుండా ఆఫర్లు ఇస్తున్నాడని లోకేష్‌పై దేవినేని అవినాష్ మండిపడ్డారు. పుంగనూరులో చంద్రబాబు విధ్వంసం సృష్టిస్తే.. భీమవరంలో లోకేష్ అదే విధ్వంసాన్ని కొనసాగించాడని మండిపడ్డారు. దేవినేని అవినాష్ మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో చేసిన అవినీతిపై చంద్రబాబు, లోకేష్ సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబు అవినీతిపై ఎల్లో మీడియా ఎందుకు డిబేట్లు పెట్టదని సూటిగా ప్రశ్నించారు. రూ.118 కోట్ల ముడుపులపై బీజేపీ, పవన్ ఎందుకు మాట్లాడరని నిలదీశారు. అమరావతి ల్యాండ్స్, టిడ్కో ఇళ్లు, స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణాలపై చంద్రబాబు సమాధానం చెప్పాల్సిందేనన్నారు.