రాజధానిని ఎక్కడ తరలిపోతుందోనన్న బాధలో బాబు

 గిరిజన టీచర్ల పోస్టుల విషయంపై సుప్రీం కోర్టులో రివిజన్ పిటిషన్ వేయాలని సీఎంకు లేఖ

వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు

విశాఖపట్నం: కరోనా కంటే రాజధానిని ఎక్కడ విశాఖకు తరలిపోతుందోనన్న బాధే చంద్రబాబుకు ఎక్కువగా ఉందని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు విమర్శించారు. శనివారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు.  విశాఖకు వ్యతిరేకంగా అనేక పిటిషన్లను కోర్టులో వేయించడం వెనుక విశాఖపై ఆయనకి ఉన్న విష సంస్కృతికి నిదర్శనమని నిప్పులు చెరిగారు.గిరిజన ప్రాంతాలలో ఉపాధ్యాయ పోస్టులను 100 శాతం ఎస్టీలకు ఇవ్వకూడదనే తీర్పుపై రాజ్యాంగపరమైన హక్కులను కాపాడాలని సుప్రీం కోర్టులో రివిజన్ పిటిషన్ వేయాలంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాశామని దాడి వీరభద్రరావు  తెలిపారు.

అదే భ్రమలో ఉన్నారు
చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఇంకా తానే అధికారంలో ఉన్నాననే భ్రమలో ఉన్నారని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు విమర్శించారు.  ఇంకా అధికారులను తన గుప్పెట్లో ఉంచుకోవాలనే భావనతో అధికారంలో ఉన్నట్లు చంద్రబాబు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ రమేష్ కేంద్రానికి రాశారని చెబుతున్న లేఖ ఆయన రాసింది కాదని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన ఫిర్యాదు వాస్తవం అని తేలిందని పేర్కొన్నారు.  

Back to Top