కులాల మధ్య చంద్రబాబు చిచ్చు...

వైయస్‌ జగన్‌ నవరత్నాలను చంద్రబాబు కాపీకొడుతున్నారు..

చంద్రబాబు హామీలు ప్రజలు నమ్మరు..

వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.రామచంద్రయ్య..

వైయస్‌ఆర్‌జిల్లా: కులాల మధ్య చంద్రబాబు చిచ్చు రేపుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.రామచంద్రయ్య మండిపడ్డారు.చంద్రబాబు పంపిన రిజర్వేషన్ల బిల్లు కేంద్రానికి చేరలేదని ప్రధాని ఇచ్చిన అగ్రవర్ణాల 10 శాతం రిజర్వేషన్లలో ఏ కులానికి ఎంతనే నిర్ణయించుకునే అధికారం ఎవరికీ లేదన్నారు.కులాల కుంపటి రాజేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

2014 ఎన్నికల్లో ఏ హామీని నెరవేర్చాలో చంద్రబాబు చెప్పాలన్నారు.వైయస్‌ జగన్‌ చెప్పిన నవరత్నాలను ఒక్కొక్కటిగా చంద్రబాబు ప్రకటిస్తున్నారన్నారు.బాబు తన స్వప్రయోజనాల కోసం యత్నిస్తున్నారన్నారు.చంద్రబాబు సొంతవారికి కాంట్రాక్టులు ఇచ్చి కమీషన్లు దండుకుంటున్నారన్నారు.చంద్రబాబు ఇచ్చే హామీలను ఎవరూ నమ్మరని తెలిపారు.

Back to Top