వైయస్‌ఆర్‌సీపీ మేనిఫెస్టోతో అన్నివర్గాలకు మేలు

వైయస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పేదలకు వరం

వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ

 

విజయనగరం: అన్నివర్గాలకు మేలు చేసేవిధంగా వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మేనిఫెస్టో రూపొందించారని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.విజయనగరంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. వైయస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ  పథకాన్ని ప్రవేశపెట్టి రాష్ట్రంలో పేదలకు ఒక ఆత్మసై్థరాన్ని కల్పించారన్నారు. పేదలు  అనారోగ్యం పాలయితే..ఆస్తులను అమ్ముకోవాల్సిన అవసరం లేకుండా వైయస్‌ఆర్‌ లక్షల మందికి ఆపరేషన్లు చేయించారన్నారు. చంద్రబాబు పాలనలో ఆరోగ్యశ్రీ నీరుగారిపోయిందని.. పేదలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తన తండ్రి వైయస్‌ఆర్‌ స్ఫూర్తితో 1000 రూపాయలు దాటితే ఏ వైద్యమయిన సరే వైయస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ  ద్వారా తెలుగు రాష్ట్రాల్లోనే కూడా ఇతర నగరాల్లో కూడా వర్తింపు చేసే విధంగా నిర్ణయం తీసుకున్నారన్నారు. దాంతో పాటు ఏడాదికి ఐదు లక్షలు ఆదాయం లోపు  ఉన్నవారందరికి  కూడా యూనివర్శల్‌ హెల్త్‌ పథకం ప్రవేశపెట్టారన్నారు.

  అమ్మ ఒడి పథకం ద్వారా బడికి వెళ్ళే విద్యార్థులకు 15వేల రూపాయలు ఇస్తారన్నారు. వైయస్‌ఆర్‌ హయాంలో ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు పూర్తి రీయింబర్స్‌మెంట్‌ ఉండేది.ఐదు సంవత్సరాలుగా చంద్రబాబు హయాంలో ఫీజు రీయింబర్స్‌ను పూర్తిగా నిర్వీర్యం చేశారు. తమ పిల్లలను చదివించుకోలేక తల్లిదండ్రులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ నేపథ్యంలో తన తండ్రి స్ఫూర్తితో పూర్తి  ఫీజురీయింబర్స్‌మెంట్‌ ప్రభుత్వమే భరింస్తుందన్నారు. అంతేకాకుండా హాస్టల్,మెస్‌ చార్జీలకు 20వేలు రూపాయలు ఇస్తామన్నారు. ప్రైవేట్‌ స్కూళ్ల ఫీజుల నియంత్రణకు కమిటీ ఏర్పాటు చేస్తారు.ఆడపిల్లలకు పెళ్ళి జరిగితే పెళ్ళికానుకగా ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలకు లక్ష రూపాయలకు ఇస్తారన్నారు. ఎస్సీ,ఎస్టీలకు భూముల పంపిణీతో పాటు సాగుచేసుకోవడానికి ఉచిత  బోర్లు ఏర్పాటు చేస్తామన్నారు. మహిళా సాధికారిత కోసం చంద్రబాబు లాగా మాయా మాటలు చెప్పి మోసం చేయడం కాకుండా.. ఎన్నికల తేదీ నాటికి డ్వాక్రా మహిళలకు ఉన్న అప్పును నాలుగు దఫాలుగా చెల్లిస్తామన్నారు. బీసీ సబ్‌ప్లాన్‌ ఏర్పాటు చేసి సంవత్సరానికి 15 వేల కోట్లు కేటాయిస్తాం.

నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం ఎస్సీ,ఎస్టీ,బీసీలకు కేటాయిస్తామన్నారు. చంద్రబాబు ఆచరణకు సాధ్యం కాని హామీలిచ్చి ప్రజలను మోసం చేశారని,  గత ఎన్నికల్లో చంద్రబాబు బీసీలకు అనేక హామీలిచ్చి మోసం చేశారన్నారు.  బ్రాహ్మణులకు కార్పొరేషన్‌తో పాటు దేవాలయాల్లో పనిచేసే అర్చకులకు కూడా న్యాయం చేస్తామని తెలిపారు. వ్యవసాయం పండగలా చేసుకునే విధంగా రైతులకు వరాలను వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మేనిఫెస్టోలో ప్రకటించారని తెలిపారు. మసీదుల ఇమామ్,మౌజంలకు గౌరవవేతనంగా 15 వేల రూపాయలు ఇస్తామన్నారు. పాస్టర్లకు గౌరవేతనంగా 5 వేలు రూపాయలు ఇస్తామన్నారు. అందరికి గౌరవంగా జీవించే విధంగా చేస్తామన్నారు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఆసరా ఉంటుందన్నారు. రైతులకు పెట్టుబడి కింద 12,500 రూపాయలు ఇవ్వడమే కాకుండా పంట బీమా ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లించాలనే నిర్ణయం తీసుకున్నామన్నారు.

వ్యవసాయానికి తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్‌ ఇస్తామని,  పండిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మూడు వేల కోట్ల ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి ఆదుకుంటామన్నారు. నాలుగువేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధి ఏర్పాటు చేస్తామన్నారు. వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్డు,టోల్‌ ట్యాక్స్‌ రద్దు చేస్తామన్నారు. రైతులు ప్రమాదవశాత్తూ మరణిస్తే వైయస్‌ఆర్‌ భరోసా ద్వారా 7లక్షల రూపాయలు ఇవ్వాలని  వైయస్‌ జగన్‌ నిర్ణయించారని తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి నెలకు 10వేల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామన్నారు. వృద్ధులకు ప్రతి నెలా 3వేల రూపాయలు పింఛను ఇస్తామని తెలిపారు.అన్నివర్గాలకు మంచి జరిగే విధంగా రూపొందించిన సమగ్ర మేనిఫెస్టో ద్వారా మంచి జరుగుతుందన్నారు.

 

Back to Top