చంద్రబాబు జిమ్మిక్కులు ప్రజలు గుర్తించారు..

చంద్రబాబు వ్యాఖ్యలు కామెడిషోను తలపిస్తోంది

వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ

విజయనగరం: బాబు మాటలు పరిణతి చెందిన నేతలా కనిపించడం లేదని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ అన్నారు.విజయనగరంలో ఆయన మీడియతో మాట్లాడారు. బాబు వ్యాఖ్యలు కామెడీ షోని తలపిస్తున్నాయన్నారు.ఐదేళ్లు పదవిలో ఉండి తెలంగాణ నుంచి రావాల్సిన లక్ష కోట్లు ఎందుకు తీసుకురాలేకపోయారని ప్రశ్నించారు.లాలూచీ,అవినీతి,ఓటుకు కోట్లు కేసుతో తోక ముడుచుకుని ఆంధ్రాకు వచ్చారన్నారు. జగన్‌ సీఎం అయితే తెలంగాణ నుంచి రావాల్సిన ఆస్తులు ముక్కుపిండి తెస్తారన్నారు.స్వలాభం కోసం చంద్రబాబు ప్రత్యేకహోదాను తాకట్టు పెట్టారన్నారు.చంద్రబాబు,మోదీ కలిసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారన్నారు.చంద్రబాబు జిమ్మిక్కులు ప్రజలు గుర్తించారన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top