డీజీని బదిలీ చేస్తే ఎందుకంత రాద్ధాంతం

ఎన్నికలు నిష్ఫక్షపాతంగా జరగాలంటే డీజీపీని కూడా తప్పించాలి

పోలీసు వాహనాల్లో టీడీపీ డబ్బు తరలిస్తోంది.

చంద్రబాబే కాదు..జాతీయ నేతల చేత అబద్ధాలు చెప్పిస్తున్నారు..

రెండెకరాల చంద్రబాబు.. వేల కోట్ల అధిపతిగా ఎలా ఎదిగారు

వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ

విజయనగరం:ఎన్నికలు పారదర్శకంగా జరగాలంటే డీజీపీ ఠాకూర్‌ను కూడా తప్పించాలని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్‌ చేశారు.విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడారు.శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన ఇంటెల్సిజెన్స్‌ రాజకీయాల్లో జోక్యం చేసుకుని అడుగులకు మడుగులెత్తుతున్నారని ధ్వజమెత్తారు. ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేస్తే ఎందుకింత రాద్ధాంతం అని ప్రశ్నించారు. విద్యాసంస్థల వ్యానుల్లో నగదును తీసుకెళ్తుండగా స్థానిక ఎమ్మార్వో,పోలీసు అధికారులు ఆపి తనిఖీలు చేస్తే డీజీ ఏబీ వెంకటేశ్వరరావు ఫోన్‌ చేస్తే శ్రీకాకుళం ఎస్పీ  అక్కడకు వెళ్లవలసిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. పోలీసులే డీజీపీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నగదును పోలీస్‌ వాహనాలు ద్వారా పంపిణీ చేస్తున్నారన్నారు. దీనిపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేసామన్నారు.వైయస్‌ఆర్‌సీపీ నేతల ఫోన్లు ట్యాపరింగ్‌ కూడా చేస్తున్నారన్నారు.  వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదుకు స్పందించి ఏబీ వెంకటేశ్వరరావుపై ఈసీ వేటు వేసిందన్నారు. దీనిపై సాక్ష్యాలతో సహా ఫిర్యాదు చేశామన్నారు. నిష్ఫక్షపాతంగా ఎన్నికలు జరగాలంటే డీజీపీగా ఠాకూర్‌ను కూడా విధుల నుంచి తప్పించాలని డిమాండ్‌  చేశారు.

ఆర్థిక ఉగ్రవాదులు అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తప్పబట్టారు.రెండు ఎకరాల ఆసామిగా ఉన్న చంద్రబాబు..నేడు వేల కోట్లకు అధిపతిగా ఎలా ఎదిగావు అని ప్రశ్నించారు.రాజకీయాల్లో నీకంటే వెన్నుపోటు రాజకీయాలు చేసేవారు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు.ఏబీ వెంకటేశ్వరరావు డీజీగా తన ఉద్యోగ ధర్మాన్ని నిర్వహిస్తున్నారా అని ప్రశ్నించారు.కాపు ఉద్యమంలో రైలు తగలబెట్టితే ఇప్పటికైనా చర్యలు తీసుకున్నారా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే సర్వేశ్వరావు మృతికి కారణం ఇంటెలిజెన్స్‌ వైఫల్యం కాదా అని ప్రశ్నించారు.వైయస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో ఇప్పటికి దర్యాప్తు సాగడంలేదన్నారు.విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో వైయస్‌జగన్‌మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం జరిగిందని.. ఇది మీ వైఫల్యం కాదా..అని ప్రశ్నించారు. అధికారులను బదిలీ చేస్తే చంద్రబాబుకు ఏం సంబంధం అని ప్రశ్నించారు.ఎన్నికలంటే చంద్రబాబు భయపడుతున్నారన్నారు. ఏబీ వెంకటేశ్వరావు ద్వారా  ఓటర్లను తొలగించారన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను కొనడానికి ఏబీ వెంకటేశ్వరరావు మధ్యవర్తిత్వం చేశారని తెలిపారు. టీడీపీలో పదవులు ఇవ్వాలన్న కూడా ఏబీ వెంకటేశ్వరావు రికమండ్‌ చేయాలని సాక్షాత్తూ విజయవాడలో ఒక టీడీపీ ఎమ్మెల్సీ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు.

 ఏబీ వెంకటేశ్వరరావు టీడీపీ  కార్యకర్తలా పనిచేస్తున్నారని తెలిపారు.చంద్రబాబు జాతీయ నాయకులను ఎన్నికల ప్రచారానికి తీసుకొస్తున్నారని,చంద్రబాబే కాదు..జాతీయ నేతల చేత అబద్ధాలు చెప్పిస్తున్నారన్నారు.డీజీ ఏబీ వెంకటేశ్వరావును తప్పించారని, ఆయనతో పాటు డీజీపీని కూడా తప్పించాలని డిమాండ్‌ చేశారు.చట్టాలను చేతుల్లో పెట్టుకుని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబు కంటే నీచంగా ఆలోచించే వ్యక్తి మరొకరు ఉండరన్నారు.

Back to Top