చేతగాని దద్దమ్మలా చేతులు కట్టుకున్నావు

ఈ ఐదేళ్లలో రాష్ట్రానికి నువ్వు చేసిన మేలేంటీ..?

అమరావతిలో ఒక్క శాశ్వత భవనం అయినా నిర్మించావా..?

కనకదుర్గమ్మ ఎదుట ఫ్లైఓవర్‌ అయినా నిర్మించావా..?

ప్రత్యేక హోదా కోసం టీఆర్‌ఎస్‌ మద్దతిస్తానంటే తప్పా..?

చంద్రబాబూ ఇకనైనా నీ జిమ్మిక్కులు ఆపు

ఏప్రిల్‌ 11 తరువాత టీడీపీ తుడిచిపెట్టుకపోవడం ఖాయం

కేంద్రమంత్రి రిలీజ్‌ చేసిన లేఖపై సమాధానం చెప్పుబాబూ..?

ప్రజలను ఇంకా ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతావు

రాష్ట్ర అభివృద్ధి, ప్రత్యేక హోదా సాధనే వైయస్‌ఆర్‌ సీపీ లక్ష్యం

ప్రజలంతా వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆశీర్వదించండి

టీఆర్‌ఎస్‌తో పొత్తు అంటూ చంద్రబాబు చేసే ఆరోపణల్లో వాస్తవం లేదు

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ

విజయనగరం: చంద్రబాబు ఏది చెబితే అది నమ్మేయడానికి తెలుగు ప్రజలు అమాయకులు కాదని, తెలంగాణలో తుడిచిపెట్టుకుపోయినట్లే ఏప్రిల్‌ 11వ తేదీ తరువాత ఆంధ్రరాష్ట్రంలో కూడా అదే పరిస్థితి ఏర్పడుతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. నాలుగున్నర సంవత్సరాలు మోడీ బాబూ జోడీగా పాలిస్తూ.. ప్రత్యేక హోదాను 15 సంవత్సరాలు సాధిస్తామన్నారని, ఇచ్చిన మాటల్లో ఒక్కటి కూడా నిలబెట్టుకోలేక దద్దమ్మలా చేతులు ముడుచుకొని కూర్చొని నిరసన అంటూ నాటకాలు ఆడుతున్నాడని మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం కేసీఆర్‌ మద్దతు తెలుపుతానంటే వద్దు అని చెప్పమంటారా..? ప్రత్యేక హోదా అవసరం లేదా..? అని చంద్రబాబును ప్రశ్నించారు. చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్‌కు అవసరం లేకపోవచ్చు కానీ.. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి, ఐదు కోట్ల ఆంధ్రరాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హోదా అవసరమన్నారు. విజయనగరంలో బొత్స సత్యనారాయణ మీడియా మాట్లాడుతూ.. 

  • – ప్రత్యేక హోదాకు మద్దతు తెలుపుతామంటే వద్దు వద్దు అని చెప్పమంటారా.. ఎందుకు నువ్వు హరికృష్ణ శవాన్ని అడ్డుపెట్టుకొని టీఆర్‌ఎస్‌తో పొత్తుకు వెంపర్లాడావు. 
  • – పేరంటాలాకు, పెళ్లిలకు, యాగాలకు ఎందుకు కేసీఆర్‌ను పిలిచావు. మీ మంత్రులు కేసీఆర్‌కు సిగరెట్‌ కాల్చుతుంటే లైటర్లు ఎందుకు అందించారు. ఇవన్నీ తెలుగు ప్రజలు మరిచిపోయారనుకుంటున్నారా.. 
  • – ఈ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. ఐదుకోట్ల ఆంధ్రుల శ్రేయస్సే మాకు ప్రథమం. ప్రత్యేక హోదాను సమర్థిస్తూ.. తెలంగాణ రాష్ట్రమే కాదు.. దేశంలో ఏ రాష్ట్రం మద్దతు ఇచ్చినా అన్ని రాష్ట్రాల దగ్గరకు వెళ్లి కోరుతాం. 
  • – చంద్రబాబు జిమ్మిక్కులు, కుయుక్తులు ఇప్పటితో ఆపాలి. నువ్వు, నీ కొడుకు నల్లచొక్కాలు వేసుకుంటే పోరాటం చేసినట్లు. నువ్వు ఎవరితోనైనా జతకడితే వారు పవిత్రులు. ఇంకెవరైనా మాట్లాడితే అపవిత్రులా..? 
  • – నీకు వత్తాసు పలుకుతూ ప్రచార మాధ్యమాలు ఉన్నాయని మాట్లాడుతున్నావా..? తెలుగు ప్రజలు అమాయకులు అంటున్నావా..? 
  • – ప్రజలంతా ఆగ్రహంతో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం తుడిచిపెట్టుకుపోవడం ఖాయం. 
  • – చంద్రబాబుకు ఇంకోకాయన తోడయ్యాడు. ఆయన సవాళ్లు, తోలు, తొక్కలు తీస్తానని మాట్లాడుతున్నాడు. ఏమనుకుంటున్నావు పవన్‌ కల్యాణ్‌ రాజకీయాలంటే..  
  • – 2014లో టీడీపీతో మిత్రపక్షంగా పోటీ చేశావు. తెలుగుదేశం రావడానికి నేనే కారణమన్నావు. ఇవాళ లోపాయికారి ఒప్పందాలతో పోటీ చేస్తున్నావు. 
  • – చంద్రబాబు, పవన్‌కు దమ్మూ, ధైర్యం ఉంటే కలిసి పోటీ చేయండి. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అక్కర్లేదు అని చెప్పండి. 
  • – ఆ రోజు చంద్రబాబువి పాచిపోయిన లడ్డూలు అన్నావు.. ఇవాళ లడ్డూలు సువాసన వస్తున్నాయా..? ప్రజల చెవుల్లో పెట్టిన పువ్వులు చాలు. 
  • – ఏ ఒక్కరోజూ కూడా మా నాయకుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాటల్లో తేడా లేదు. మా విధానం ఒక్కటే విభజన చట్టంలోని ప్రతి అంశం క్షుణ్ణంగా అమలు చేయాలి. దాని కోసం పోరాటం చేస్తున్నాం. 
  • – బీజేపీ రాష్ట్ర ప్రజలను మోసం చేసింది. రాష్ట్రాన్ని పూర్తిగా నష్టం చేసింది. ఆంధ్రరాష్ట్రాన్ని మోసం చేసిన ఏ రాజకీయ పార్టీ కూడా మనుగడ సాధించలేదు. మట్టికొట్టుకుపోవాల్సిందే. ఎన్నాళ్లు మీ ఆటలు. 
  • – అమరావతిలో ఎందుకు ఒక్క శాశ్వత భవనాన్ని నిర్మించలేదు చంద్రబాబు. పెట్టుబడి సదస్సుల్లో లక్షల కోట్లు వచ్చాయన్నారు. ఎందుకు పరిశ్రమలు రాలేదు. 
  • – విజయవాడ దుర్గమ్మ గుడి ఫ్లైఓవర్‌ కట్టడానికి దిక్కులేదు. ఇవాళ మాటలు చెబుతున్నారు. 
  • – చంద్రబాబూ నువ్వు చేసిన ఒక్క మంచి పని అయినా ఉందా..?
  • – రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించడానికి దుష్టశక్తులన్నీ కలుస్తున్నాయి. ఒకపక్క తెలుగుదేశం, మరోపక్క జనసేన, కాంగ్రెస్, కొత్తగా ఇంకోవ్యక్తి తయారయ్యాడు. ఆ పేరు చెప్పడానికి కూడా సిగ్గేస్తుంది. అందరూ కలిసి పోటీ చేస్తే బాగుండేది కదా.. ప్రజలు తీర్పు ఇచ్చేవారు కదా. 
  • – కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌ ఒక లెటర్‌ రిలీజ్‌ చేశారు. చంద్రబాబు దస్తూరితో 2016లో లెటర్‌ రాశారు. ప్యాకేజీని ప్రకటించారు సంతోషం. ఇది అద్భుతం. మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మా చర్మంతో చెప్పులు కుట్టిస్తాం. మీ మేలు మర్చిపోలేమని మన భాషలో రాసిన లెటర్‌ను ఈ రోజు కేంద్రమంత్రి రిలీజ్‌ చేశారు. 
  • – ఈ రోజు నల్లచొక్కాలు వేసుకొని ప్రపంచ యుద్ధం జరిగినట్లుగా ఆయన, ఆయన కొడుకు మాట్లాడుతున్నాడు. వీరికి వత్తాసు పలుకుతూ పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతున్నాడు. 
  • – ఓడిపోతానని తెలిసి చంద్రబాబు జాతీయ పార్టీ నాయకులను తీసుకొస్తున్నాడు. చంద్రబాబు మాటలకు విలువ లేదనే విషయం తెలిసిపోయింది. 
  • – నాలుగు సంవత్సరాలు మత తత్వ పార్టీ బీజేపీతో జతకట్టి. ఆఖరికి ఎన్నికలు వస్తున్నాయని కొత్త వేషం వేస్తే ప్రజలు మర్చిపోతారనుకుంటున్నారా.. ? రాష్ట్రంలో ఉన్న ముస్లిం సోదరులు మర్చిపోతారనుకున్నావా చంద్రబాబూ..? 
  • – ఇలాంటి జిమ్మిక్కులు మాని ఈ ఐదు సంవత్సరాలు రాష్ట్రానికి ఏం మేలు చేశావో.. ఏ విధంగా రాష్ట్రం అభివృద్ధి చెందిందో చూపించి ఓట్లు అడుగు. 
  • – 2009లో వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలన చూపించి ఓట్లు అడిగారు. రాబోయే కాలంలో ఇంకా కొత్త కార్యక్రమాలు అమలు చేస్తాను, విద్యుత్‌ చార్జీలు పెంచాను అని చెప్పి అమలు చేశారు. ప్రజలు చూశారు కాబట్టి వైయస్‌ఆర్‌ను మళ్లీ గెలిపించారు. 
  • – రోజూ కేసీఆర్‌తో కుమ్మక్కు అని మాట్లాడుతున్నారు. ఓటుకు కోట్ల కేసులో దొరికిపోయిన దొంగ చంద్రబాబు. ఏపీ సీఎం దొంగగా దొరికి మన గౌరవాన్ని తీసేశారు. ఉమ్మడి రాష్ట్రంలో హక్కులు ఉంటే అర్ధరాత్రి వాళ్లతో కుమ్మకై, వాళ్ల అడుగులకు మడుగులు వత్తి ఈ రోజు మాకు అంటగడుతుడు. 
  • – ప్రజలారా.. తేల్చుకోండి. రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ కొన్ని సందర్భాల్లో టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకొని ఎన్నికల్లో పోటీ చేసింది. వైయస్‌ఆర్‌ సీపీ టీఆర్‌ఎస్‌తో ఎప్పుడైనా కలిసిందా..? ఎక్కడైనా ఆ ప్రక్రియ జరిగిందా..? ప్రజలు గమనించాలి. 
  • – చంద్రబాబు మోసాలు, మాయలో పడొద్దు. వైయస్‌ఆర్‌ సీపీ లక్ష్యం ఒకటే. సంక్షేమ రాజ్యం తీసుకురావడం, ఆ లక్ష్యం వైయస్‌ఆర్‌ ఆశయాలకు అనుగునంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడం. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆశీర్వదించాలని రాష్ట్ర ప్రజలను కోరుతున్నాం. 
  •  
Back to Top