వైయస్‌ జగన్‌తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం

వైయస్‌ఆర్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ
 

విజయనగరం: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. శుక్రవారం విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ నామినేషన్‌ దాఖలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..చంద్రబాబు అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆందోళన వ్యక్తం చేశారు. హామీలను నెరవేర్చని చంద్రబాబుకు ఓటుతో బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 

 

Back to Top