తప్పు చేసి..ఎదురుదాడా..

చంద్రబాబు తాటాకుచప్పళ్లకు భయపడం

డేటా చోరీపై హైదరాబాద్‌లో ఫిర్యాదు చేస్తే తప్పేంటి

వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ

హెదరాబాద్‌:తప్పు చేసి,కప్పిపుచ్చుకునేందుకు టీడీపీ యత్నాలు చేస్తుందని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.హైదరాబాద్‌ వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గోప్యంగా ఉండాల్సిన ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని రాజకీయ,అవినీతి అవసరాలు కోసం ప్రైవేటు వ్యక్తులతో లాలూచీ పడి.. టీడీపీ తిరిగి ఎదురుదాడి చేస్తుందని «ధ్వజమెత్తారు. తప్పేచేసి  వితండ వాదం చేస్తుందన్నారు.  యూఐడిఏఐ ఛైర్మన్‌గా ఉన్న సత్యనారాయణ అనే అధికారి స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన ద్వారానే ఈ సమాచారం అంతా లీక్‌ అయ్యిందని ఆరోపించారు. బాధ్యత గల వ్యక్తి ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేయడం సమంజసం కాదన్నారు. రాజకీయ పార్టీకి తొత్తుగా ఉండటం పద్దతికాదన్నారు. ప్రతి రాజకీయ పార్టీకి డేటా ఉంటుందన్నారు.మీ డేటాతో మాకేంటి పని అని ప్రశ్నించారు. ఆంధ్రలో పౌరుల డేటాను సేవా మిత్ర ద్వారా ఎందుకు దొంగిలించారని ప్రశ్నించారు. టీడీపీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడుతున్నారన్నారు. ఎలక్షన్‌ కమిషన్‌ వద్ద గోప్యంగా ఉండాల్సిన సమాచారం అంతా దొంగిలించారని  నేడు వాస్తవాలు బయటకొచ్చాయన్నారు. డేటా చోరీపై ఏనాడో వైయస్‌ఆర్‌సీపీ చెప్పిందన్నారు.  ఎన్నికల కమిషన్‌కు దీనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశామన్నారు. సర్వేలు అడ్డుకున్నందుకు వైయస్‌ఆర్‌సీపీ నేతలపై కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. దీనిపై ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బాధ్యత గల రాజకీయ పార్టీగా,పౌరుడిగా మా హక్కులపై పోరాడుతున్నామన్నారు. ఎదురుదాడి చేస్తూ తెలుగుదేశం పార్టీ పక్కదోవ పట్టించడానికి ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఐటి గ్రిడ్‌ సంస్థతో తెలుగుదేశానికి ఉన్న సంబంధం ఏమిటని ప్రశ్నించారు. ఆధార్‌ కార్డు సమాచారన్ని తస్కరించి రేపు ఎన్నికల్లో లబ్ధి పొందడానికి  అక్రమ మార్గం పడుతున్నారన్నారు. ఏపీకి సంబంధించిన ప్రజల వ్యక్తిగత సమాచారం దొంగించబడలేదని ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోతున్నారని ప్రశ్నించారు.డొంక తిరుగుడు చర్యలు ఎందుకు అని ప్రశ్నించారు. చంద్రబాటు తాటాకుచప్పళ్లకు భయపడేది లేదన్నారు. వ్యక్తిగత సమాచారాన్ని ఏం హక్కు ఉందని ప్రైవేట్‌ సంస్థకు కట్ట పెట్టావు అని మండిపడ్డారు. ఎన్నికలు న్యాయంగా జరగాలన్నారు. వైయస్‌ఆర్‌సీపీ సానుభూతి పరుల ఓట్లు తొలగిస్తున్నారని మూడేళ్లుగా గగ్గొలు పెడుతున్నామన్నారు. ఓట్ల తొలగింపుకు సర్వేలు చేస్తున్న చంద్రబాబు తాబేదారులను పోలీస్‌స్టేషన్‌లో అప్పజెప్పితే..పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చి..తిరిగి వైయస్‌ఆర్‌సీపీ  నేతలు,కార్యకర్తలపై  కేసులు పెట్టించారన్నారు.దొంగ పని చేసి..వైయస్‌ఆర్‌సీపీపై ఎదురుదాడి చేయడం  పద్దతి కాదన్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్న స్పీకర్‌ వ్యక్తిగత రాజకీయాల కోసం ఆ గౌరవాన్ని మంటగలిపేస్తున్నారని ధ్వజమెత్తారు.ప్రజల వ్యక్తిగత డేటాను ఎందుకు చోరీ చేశారో చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు.

Back to Top