వైయస్‌ జగన్‌ తప్ప మరో అవకాశం లేదు

రాజన్న సువర్ణ పాలన జననేతతోనే సాధ్యం

వైయస్‌ఆర్‌ సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ

రావాలి జగన్‌ – కావాలి జగన్‌ నూతన ఉత్తేజాన్ని నింపుతోంది: ఆనం

 

హైదరాబాద్‌: చంద్రబాబు దుష్టపాలన తొలగాలంటే రాష్ట్రానికి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తప్ప మరో అవకాశం లేదని తేటతెల్లమైందని పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో బొత్స సత్యనారాయణ, రాజ్యసభ్య సభ్యులు విజయసాయిరెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డిలు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి చేతుల మీదుగా రావాలి జగన్‌ – కావాలి జగన్‌ ఆడియో సాంగ్‌ను విడుదల చేయించారు. అనంతరం బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. రాష్ట్రానికి వైయస్‌ జగన్‌ అవసరం ఎంత ఉందో పాట రూపంలో రూపొందించామన్నారు. ఎందుకు వైయస్‌ జగన్‌ రావాలి.. ఎందుకు జగన్‌ కావాలి అనే అంశాన్ని రాష్ట్రమంతా ప్రచారం చేయాలని నిర్ణయించామన్నారు. అందులో భాగంగా పాటను విడుదల చేశామన్నారు. 

వాస్తవంగా ఆలోచన చేస్తే అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం దుష్టపాలన, ఇచ్చిన మాట నెరవేర్చకుండా చేస్తున్న కార్యక్రమాలు ఇవన్నీ తొలగాలంటే, దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలన మళ్లీ రావాలంటే అది వైయస్‌ జగన్‌తోనే సాధ్యమన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రత్యేక హోదా, ఉపాధి అవకాశాలు, రైతులు, రైతు కూలీలకు కావాల్సిన సంక్షేమాలు, మహిళలు కావాల్సిన అభివృద్ధిపై పాటను రూపొందించామన్నారు. పార్టీ తాలూకా విధి విధానాలన్నంటినీ రూపొందించే మేనిఫెస్టోను కూడా కళా రూపంలో తీసుకెళ్లాలని నిర్ణయించామన్నారు. 

రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రావాలి జగన్‌ పాట

పార్టీ విడుదల చేసిన రావాలి జగన్‌ – కావాలి జగన్‌ ప్రచార పాట కార్యకర్తలు, నాయకుల్లో నూతన ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని నింపుతుందని ఆనం రాంనారాయణరెడ్డి అన్నారు. సామాన్య ప్రజలు కూడా పాటకు ఆకర్షితులవుతారని, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పాటను రూపొందించడం జరిగిందన్నారు. పాట రావాలి జగన్‌ – కావాలి జగన్‌ కార్యక్రమానికి మరింత స్ఫూర్తినిస్తుందన్నారు. 

 

Back to Top