ఢిల్లీలో చంద్రబాబు కొంగజపం...

రాజకీయాలంటే స్వార్థం కాదు..విలువలు..

ప్రత్యేక హోదాయే వైయస్‌ఆర్‌సీపీ అజెండా

వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ

విజయవాడ: పార్లమెంటు సమావేశాలు ముగుస్తున్న సమయంలో చంద్రబాబు దొంగ పోరాటాలు చేస్తున్నారని.. రోజుకో మాట మారుస్తూ చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఢిల్లీలో ధర్నా అంటూ కొంగజపాన్ని చేస్తున్నారన్నారు. గత నాలుగేన్నరేళ్లుగా ప్రత్యేకహోదా  సాధనకు   వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలో వైయస్‌ఆర్‌సీపీ పోరాటం చేస్తుందన్నారు.హోదా వస్తే తప్ప రాష్ట్రానికి శాశ్వతమైన పరిష్కారం ఉండదని పోరాటం చేస్తున్నామన్నారు.ఏపీ అభివృద్ధి చెందాలంటే ప్రత్యేకహోదా తప్పనిసరి అని అన్నారు.గతంలో చంద్రబాబు ప్రత్యేకహోదాపై హేళనగా మాట్లాడారని గుర్తుచేశారు. ప్రత్యేకహోదా వస్తే ఈ రాష్ట్రానికి ఏం ఒరుగుతుందంటూ చంద్రబాబు మాట్లాడిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. ప్రత్యేకహోదా కోసం వైయస్‌ఆర్‌సీపీ నాలుగున్నరేళ్లుగా పోరాటం చేస్తే చంద్రబాబు గేలి చేశారని తెలిపారు.

రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారని వైయస్‌ఆర్‌సీపీపై చంద్రబాబు దుమ్మెత్తి పోశారని గుర్తుచేశారు.అమరావతి శంకుస్థాపను ప్రధాని మోది వచ్చిన మర్నాడే వైయస్‌ఆర్‌సీపీ స్పందించిందన్నారు.రాష్ట్రానికి ఆయన తెచ్చిన మట్టి కుండే తప్ప ఏమి ఒరగదు. ప్రత్యేకహోదాపై మోదీ స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని వైయస్‌ఆర్‌సీపీ డిమాండ్‌ చేసిందని గుర్తుచేశారు.ప్రజలను మళ్లీ మోసం,దగా చేయడానికి చంద్రబాబు నేడు ఢిల్లీలో ధర్మపోరాట దీక్షలు మొదలుపెట్టారని విమర్శించారు.దేశాన్ని పాలిస్తున్న బీజేపీ,రాష్ట్రాన్ని పాలిస్తున్న టీడీపీ,ఏపీని ముక్కలు చేసి కాంగ్రెస్‌ పార్టీలు రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేశాయని మండిపడ్డారు.

రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్‌ పార్టీతో చంద్రబాబు చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారని ధ్వజమెత్తారు.ప్రత్యేకహోదా ఇస్తామని తిరుపతి వెంకటేశ్వరస్వామి సాక్షిగా మోదీ,చంద్రబాబు చెప్పారని, నేడు మోదీ వచ్చి చంద్రబాబును తిడతారని, చంద్రబాబు..మోదీని తిడతారని తెలిపారు. మోదీ–చంద్రబాబు వ్యక్తిగతంగా దూషించుకుంటారో..మీకు రాజకీయంగా రహస్య ఒప్పందాలు ఏమున్నాయో అంతా..ఆం«ధ్రరాష్ట్ర ప్రజలకు అనవసరం అని, ప్రజలకు కావాల్సింది ఏపీ శ్రేయస్సు అని అన్నారు.రాష్ట్రానికి ప్రత్యేకహోదా కావాలి..విభజన హామీలు నెరవేరాలన్నారు.చంద్రబాబు,మోదీలను చూస్తూంటే.. నాలుగు సంవత్సరాలు కాపురం చేసి నేడు దూషించుకోవడం..కుళాయి వద్దనో,పొలం గట్టు వద్దనో తగువులాటగా వుందని చలోక్తులు విసిరారు. టీడీపీ,బీజేపీలకు ఏపీకి ఏ మేలు చేసారు.. ఏ ప్రయోజనాలు కలుగుజేశారో అనే చిత్తశుద్ధి మాత్రం కనబడటం లేదన్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో ప్రత్యేకహోదాయే మా అజెండా అని  వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మొదట నుంచి చెబుతున్నారన్నారు. ఎవరెన్ని  కుయుక్తులు పన్నిన,కించపరిచిన ఒకే మాట మీద వైయస్‌ఆర్‌సీపీ నిలబడి వుందన్నారు.ఒకే సిద్ధాంతం, నైజంతో ముందుకెళ్తున్నామని తెలిపారు.రాష్ట్ర ప్రయోజనమే మా నైజమని, రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధనే మ సిద్ధాంతం అని తెలిపారు.బీజేపీ,టీడీపీ పెద్దలు ఈ రాష్ట్రానికి ఏం సందేశం ఇవ్వబోతున్నారని ప్రశ్నించారు.రాజకీయ వ్యవస్థ, రాజకీయ నాయకులంటే ప్రజల్లో చులకన ఏర్పడిందన్నారు. ఆ విలువలు కాపాడడానికి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆలోచన చేస్తున్నారన్నారు.సంతలో పశువులను కొన్నట్లు 23 ఎమ్మెల్యేలను అక్రమంగా కొనుగోలు చేసిన చంద్రబాబు..నేడు నీతులు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.ఏపీలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారు.రాష్ట్రానికి ఏమిచ్చారు..ఏమొచ్చిందో పాలకులు సమాధానం చెప్పాలన్నారు.ఏపీ ఉనికి నాశనం చేయడానికి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.రాజకీయంలో స్వార్థం కాదని...విలువలు ఉండాలన్నారు.కూర్చి ప్రధానం కాదు..ఆ కూర్చి జౌన్నత్యాన్ని కాపాడాలన్నారు.వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఫొటోలను ఆటోలపై వేసుకుని తిరుగుతున్నారంటే ఆయనకు ఎంత ఆదరణ ఉందో తెలుసుకోవాలని లోకేష్‌కు సూచించారు.వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి తనయుడు వైయస్‌ జగన్‌ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.ధర్మపోరాట దీక్షల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రంలో పేదలు తినడానికి తిండిలేక అప్పుల్లో కూరుకుపోయి ఉంటే, జీతాలు లేక ఓవర్‌డ్రాప్ట్‌కు వెళ్ళిపోతుంటే..ధర్మపోరాట దీక్షకు పదికోట్ల రూపాయలు ఖర్చుపెడతారా అని మండిపడ్డారు.ఇదా ప్రజలపై మీకున్న చిత్తశుద్ధి అని ప్రశ్నించారు.పార్లమెంటు సమావేశాలు ముగుస్తున్న సమయంలో చంద్రబాబు పోరాటాలా అంటూ ధ్వజమెత్తారు.ఉద్యోగలకు జీతాలు  ఇవ్వలేని పరిస్థితుల్లో దుబారానా అంటూ మండిపడ్డారు.రాజీనామాలు చేద్దామంటే ఎందుకు రాలేదని ప్రశ్నించారు.సీనియార్టీ అంటూ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారన్నారు.అనుభవం ఉంటే రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చాలన్నారు.చంద్రబాబు లాంటి మోసగాళ్లను నమ్మొద్దన్నారు. 

Back to Top