బీసీల్లోని 107 కులాలకు న్యాయం చేస్తాం

ఏలూరులో జరిగే గర్జనలో బీసీ డిక్లరేషన్‌

సభా ప్రాంగణానికి ‘మహాత్మా జ్యోతిరావు పూలే అని నామకరణం

చంద్రబాబు బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాడు

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ

పశ్చిమగోదావరి: బీసీల్లోని 107 కులాలకు న్యాయం జరగాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బీసీ గర్జన సభ నిర్వహిస్తోందని పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. పశ్చిమ గోదావరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏలూరులో 17వ తేదీన బీసీ గర్జన సభ నిర్వహిస్తున్నామన్నారు. సభా ప్రాంగణానికి ‘మహాత్మా జ్యోతిరావు పూలే’ అని నామకరణం చేశామన్నారు. గర్జన వేదిక నుంచి వైయస్‌ఆర్‌ సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బీసీ డిక్లరేషన్‌ ప్రకటిస్తారని చెప్పారు. బలహీనవర్గాలను వాడుకొని వదిలేయడం చంద్రబాబుకు అలవాటన్నారు. బడ్జెట్‌లో బీసీ సంక్షేమానికి సరైన కేటాయింపులు జరగలేదని మండిపడ్డారు.

సంవత్సరం ఆరు నెలల కాలంగా వైయస్‌ జగన్‌ నియమించిన బీసీ అధ్యయన కమిటీ రాష్ట్రమంతా తిరిగి బలహీనవర్గాల స్థితిగతులపై నివేదిక తయారు చేశారన్నారు. ఆ నివేదికను వైయస్‌ జగన్‌కు అందజేశారన్నారు. బీసీలు అనేక కష్టాలు పడుతున్నారని కమిటీ పరిశీలనలో వెల్లడైందన్నారు. చంద్రబాబు బీసీ సంక్షేమానికి చేసిందేమీ లేదన్నారు.

వైయస్‌ జగన్‌ రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలకు న్యాయం చేసేందుకు నవరత్నాలను ప్రకటించారన్నారు. నాలుగు సంవత్సరాల తొమ్మిది మాసాల్లో చేసిందేమీ లేక వైయస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాలను చంద్రబాబు కాపీ కొడుతున్నారన్నారు. మళ్లీ ప్రజలకు రాజన్న సువర్ణ పాలన రావాలంటే వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలన్నారు. 

 

Back to Top