టీడీపీ దుష్టపాలనపై వైయస్‌ జగన్‌ సమర శంఖారావం..

ఈ నెల 6న తిరుప‌తిలో స‌మ‌ర శంఖారావం

చంద్రబాబు ఎన్నికల్లో అక్రమంగా గెలవాలని ప్రయత్నిస్తున్నారు..

వైయస్‌ఆర్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ

హైదరాబాద్‌: రేపు తిరుపతిలో జరగబోయే  సభలో టీడీపీ అవినీతి,అక్రమాలపై వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సమర శంఖారావం పూరించి అధికార టీడీపీ పతనానికి నాంది పలకబోతున్నారని వైయస్‌ఆర్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ నెల 6న తిరుప‌తిలో స‌మ‌ర శంఖారావం స‌ద‌స్సు నిర్వ‌హిస్తున్న‌ట్లు చెప్పారు. హైదరబాద్‌లోని లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు అక్రమంగా గెలవాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు పాలన భ్రష్టుపట్టిపోయిందన్నారు.

ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని లక్షల సంఖ్యల్లో  ఓటర్లను తొలగించడం, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడం, వ్యవస్థలను భ్రష్టు పట్టించి పోలీసు శాఖలో కీలక పోస్టులను ఒకే సామాజిక వర్గానికి చెందినవారికి కేటాయించడం దారుణమన్నారు.పోలీసు వ్యవస్థ ద్వారా ఎన్నికల్లో డబ్బులు పంపిణీ చేసి ఎన్నికల్లో  గెలడానికి ప్రయత్నాలు చేయబోతున్నారని వైయస్‌ జగన్‌ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారన్నారు. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నామని, బూత్‌ లెవెల్‌ కార్యకర్తలతో రేపు వైయస్‌ జగన్‌ సమావేశమవుతారని తెలిపారు. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నట్లు తెలిపారు. అందరికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో ఏలూరులో బీసీ గర్జన సదస్సు నిర్వహిస్తునట్లు తెలిపారు.ఏలూరు బీసీ గర్జన ద్వారా బీసీ డిక్లకేషన్‌ ఇవ్వబోతున్నామన్నారు.

Back to Top