ప్రజలు వాస్తవాలు గమనిస్తున్నారు..

చంద్రబాబు నీచరాజకీయాలు ఎంతోకాలం సాగవు..

ఎన్‌ఐఏ దర్యాప్తుపై భయమెందుకు..?

వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ 

విశాఖపట్నం: వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసు రోజుకో మలుపు తిరుగుతుందని ఎన్‌ఐఏకు రాష్ట్ర ప్రభుత్వం,పోలీసులు సహకరించడంలేదని వైయస్‌ఆర్‌సీపీ సీనియయర్‌ నేత బొత్స సత్యనారాయణ అన్నారు.ఈ కేసు విషయంలో ప్రభుత్వంపై చాలామందికి అనుమానాలున్నాయన్నారు..సిట్‌ దర్యాప్తు నివేదికను ఎన్‌ఐఏకు ఇవ్వమని ప్రభుత్వం చెప్పడం వెనుక అనేక అనుమానాలు కలుగుతున్నాయన్నారు. విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగిన అరగంటలో రాష్ట్ర డీజీపీ ఏం మాట్లాడాడో రాష్ట్ర ప్రజలకు తెలుసు అని అన్నారు. ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగితే  హేళన చేస్తూ మాట్లాడారన్నారు. కనీసం ఖండించలేదన్నారు. చేయలేదన్నారు. ఇది ఎయిర్‌పోర్టులో జరిగింది కాబట్టి కేంద్ర పరిధిలోకి వస్తుందని మా పరిధిలోకి రాదంటూ  చంద్రబాబు మాట్లాడారని గుర్తుచేశారు.

డిఎస్పీ స్థాయి అధికారితో సిట్‌ వేయడం పట్ల  అనేక అనుమానాలు కలగడంతో  పార్టీ పెద్దలతో చర్చించి హత్యాయత్నంపై సమగ్ర దర్యాప్తు  జరపాలని కోరామని తెలిపారు. తుదుపరి కేంద్రహోంమంత్రి కలిసి కేంద్ర దర్యాప్తు సంస్థతో సమగ్ర విచారణ చేయించాలని కోరమని తెలిపామన్నారు.రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సులు లేకుండా ఏమీ చేయలేమని ఆయన తెలిపారన్నారు.దీంతో  న్యాయస్థానాన్ని ఆశ్రయించామన్నారు. న్యాయనిపుణులు ఎయిర్‌ఫోర్టు అధారిటీ చట్టాన్ని సమగ్రంగా పరిశీలిస్తే ఎయిర్‌పోర్టులో ఇలాంటి సంఘటనలు జరిగింతే  ఐఎన్‌ఏ ద్వారా చేయాలని చట్టంలో కుణ్ణంగా ఉందన్నారు. దీంతో కోర్టులో అఫిడవిట్‌లు దాఖలు చేయడం జరిగింది. దీనిపై కోర్టు వివరణ అడిగిన ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదన్నారు.

కేంద్ర దర్యాప్తు సంస్థ విచారకు  రాష్ట్ర ప్రభుత్వం సహకరించకుండా తప్పించుకుంటుందన్నారు. వైయస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నంలో ఘటనపై చంద్రబాబు ప్రభుత్వంపై అనుమానాలు బలపడుతున్నాయన్నారు.మేం థర్డ్‌పార్టీతో విచారణ కోరితే చంద్రబాబు సిట్‌ వేసి కేసును నీరుగార్చే యత్నం చేశారన్నారు.ఎన్‌ఐఏ విచారణకు కూడా సిట్‌ సహకరించడం లేదన్నారు.కుట్రకోణంపై విచారణ జరపాలని ఎన్‌ఐఏ చార్జిషీట్‌ దాఖలు చేస్తే కేసు హైకోర్టు పరిధిలో ఉందని సిట్‌ వివరాలు ఇచ్చేందుకు  నిరాకరించిందన్నారు.కుట్రలోచంద్రబాబు,లోకేష్,పోలీసు అధికారులు పాత్ర లేకపోతే ఎన్‌ఐఏ విచారణకు ఎందుకు సహకరించడంలేదని ప్రశ్నించారు.

చంద్రబాబు నీచపు ఆలోచనలతో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.చంద్రబాబు తీరును ప్రజలు గమనిస్తున్నారని..తగిన బుద్ధి బుద్ధిచెబుతారన్నారు. చంద్రబాబు దుర్మార్గమైన  ఆలోచనలతో ఎంతో కాలం రాజకీయాలు చేయలేరని  రాష్ట్ర ప్రజలు వాస్తవాలు  గమనిస్తున్నారని తెలిపారు. వైయస్‌ఆర్‌సీపీ నిజాన్ని నమ్ముకుందని న్యాయమే గెలుస్తుందన్నారు. హత్యారాజకీయాలతో,అబద్దపు మాటలతో కాలం గడుపుకుంటూ వ్యవస్థలను మేనేజ్‌ చేస్తున్న చంద్రబాబు పాలనకు ప్రజలు తగిన చెబుతారన్నారు.

Back to Top