సెల్‌ఫోన్‌ గేమ్‌లా చంద్రబాబు రాజధాని

వైయస్‌ జగన్‌ సీఎం అయితేనే రాష్ట్రం సస్యశ్యామలం

వైయస్‌ఆర్‌ సీపీ శ్రీకాళహస్తి సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌

తిరుపతి: సెల్‌ఫోన్లలో చిన్న పిల్లల గేమ్స్‌ మాదిరిగా చంద్రబాబు రాజధాని చూపిస్తున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రీకాళహస్తి సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌ అన్నారు. నాలుగు సంవత్సరాల తొమ్మిది మాసాల్లో చేసిందేమీ లేక వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాలను కాపీ కొడుతున్నాడన్నారు. తిరుపతిలో జరిగే సమర శంఖారావం సభలో పాల్గొని మాట్లాడుతూ.. వైయస్‌ జగన్‌ అధికారంలోకి వస్తేనే నవరత్నాలు ప్రజల దగ్గరకు చేరుతాయి. రాజన్న రాజ్యం రావాలి. అందుకు ప్రజలంతా సిద్ధం కావాలి.

చంద్రబాబువన్నీ కుట్రలు, కుతంత్రాలే. ఎన్నికలు దగ్గరకు వస్తే ఎన్ని నాటకాలు ఆడుతారో ప్రజలు చూడాలి. సీఎం పదవినే పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి లాక్కున్నాడు. పథకాలు కాపీ కొట్టడం చంద్రబాబుకు కొత్తేమీ కాదు. ఓటుకు రూ. 5 వేలు ఇవ్వాలని చూస్తున్నాడు. ఆ డబ్బంతా మనదే. డబ్బు తీసుకొని వైయస్‌ జగన్‌కు ఓటు వేయాలి. చంద్రబాబు పాలనలో తెలుగుదేశం పార్టీ చిన్న చిన్న కార్యకర్తలు కూడా కోట్లు సంపాదించారు. చంద్రబాబు అవినీతి సంపాదన రూ. 6 లక్షల కోట్లకు పెరిగింది. ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. బూత్‌ లెవల్‌ కమిటీలు అప్రమత్తంగా ఉండాలి. 4 లక్షల వైయస్‌ఆర్‌ సీపీ సానుభూతిపరుల ఓట్లు తీశారని ఎన్నికల కమిషన్‌కు వైయస్‌ జగన్‌ ఫిర్యాదు కూడా చేశారన్నారు. దొంగ ఓట్లను తొలగించాలని వైయస్‌ జగన్‌ కోరారు. వైయస్‌ జగన్‌ సీఎం అయితే 20 ఏళ్లు ఏపీ సస్యశ్యామలంగా తయారవుతుంది. 

 

Back to Top