అవినీతికి కేరాఫ్ అడ్రస్ టిడిపి

వైయస్ఆర్‌సీపీ మ‌హిళా నాయ‌కురాలు  బండి పుణ్యశీల

కొట్టెటి హనుమంతరావు వెనుక ప్రధాన ముద్ధాయిలు ఇంకా ఉన్నారు

సమగ్ర విచారణ జరిపి అంద‌రిని అరెస్ట్ చేయాలి:  కెనడి

విజ‌య‌వాడ‌:  స్కామ్‌లకు, అవినీతికి టీడీపీ కేరాఫ్ అడ్ర‌స్‌గా మారింద‌ని వైయస్ఆర్‌సీపీ మ‌హిళా నాయ‌కురాలు  బండి పుణ్యశీల మండిప‌డ్డారు. విజ‌య‌వాడ న‌గ‌రంలోని   వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ కార్పొరేటర్లు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో బండి పుణ్యశీల మాట్లాడుతూ.. ప్రభుత్వం నుంచి ఇల్లు ఇప్పిస్తామని చెప్పి సామాన్య ప్రజలను టిడిపి నాయకులు మోసం చేసారన్నారు. టిడ్కో ఇల్లు ఇప్పిస్తానని నాలుగు కోట్ల రూపాయలు స్కామ్ చేసిన మాజీ కార్పొరేటర్ కొట్టేటి హనుమంతరావు సహా పలువురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన తీరును చూస్తే స్కామ్ లకు అవినీతికి కేరాఫ్ అడ్రెస్స్ టిడిపి అన్ని తెలుస్తుందన్నారు . ఈ స్కామ్ లు బాధితులైన ప్రజలకు వైయ‌స్ఆర్‌సీపీ అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. 

ఎస్సి నాయకులు దాసి జయప్రకాష్ (కెనడి) మాట్లాడుతూ.. టిడిపి ప్రభుత్వ హయంలో పేద ప్రజల సొమ్మును జలగలలా పిల్చారన్నారు. టిడ్కో ఇళ్ల పేరుతో నాలుగు కోట్ల రూపాయల స్కామును చేసిన కొట్టేటి హనుమంతరావు సహా టిడిపి నాయకులను అరెస్ట్ చేసిన నేపథ్యంలో బాధితుల పక్షాన వైయ‌స్ఆర్‌సీపీ నిలుస్తుందన్నారు. కొట్టెటి హనుమంతరావు వెనుక ప్రధాన ముద్ధాయిలు ఇంకా ఉన్నారని సమగ్ర విచారణ జరిపి వారిని కూడా అరెస్ట్ చేయాలనీ డిమాండ్ చేసారు. హనుమంతరావు చేసిన అవినీతిలో వాళ్ళకి కూడా వాటా ఉందని వారిని కూడా అరెస్ట్ చేయాలనీ కోరారు. ఒక్క పశ్చిమ నియోజకవర్గంలోనే 55 మంది భాదితులు ఉంటె నగరవ్యాప్తంగా ఇంకా భాదితులున్నారని అన్నారు. కొట్టేటి హనుమంతరావు కి బడా నాయకుల అండ ఉండబట్టే ఇంత అవినీతి చేసాడని పేర్కొన్నారు. ఇళ్ల విషయంలోనే టిడిపి వారు అవినీతి చేస్తే ఇంకా ఎన్ని అవినీతి కార్యక్రమాలు చేపట్టారో ప్రజలు గమనించాలని కోరారు. కొట్టేటి హనుమంతరావు లాంటి అవినీతిపరులు నగరంలో ఇంకా చాలామంది ఉన్నారన్నారు. 40వ డివిజన్ కార్పొరేటర్ యరడ్ల ఆంజనేయ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల సొమ్ము దోచేయడం పట్ల టిడిపికి ఉన్న శ్రద్ద హనుమంతరావును చుస్తే తెలుస్తుందన్నారు జన్మభూమి కమిటీల పేరుతో ప్రజలను మోసం చేసిన పార్టీ టిడిపి అన్ని అన్నారు

ఈ కార్యక్రమంలో స్టాండింగ్ కమిటీ సభ్యులు గుడివాడ నరేంద్ర రాఘవ, కార్పొరేటర్లు అత్తలూరి ఆదిలక్ష్మి, మైలవరపు రత్నకుమారి, ఎండి ఇర్ఫాన్, వైయ‌స్ఆర్‌సీపీ నాయకుడు పోతిరెడ్డి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Back to Top