ఏపీకి వైయస్‌ జగన్‌ సీఎం కావడం ఖాయం

వైయస్‌ఆర్‌సీపీ మచిలిపట్నం పార్లమెంటు అభ్యర్థి బాలశౌరి

కృష్ణాజిల్లా: ప్రత్యేకహోదా సాధించాలంటే వైయస్‌ జగన్‌ సీఎం అవ్వాలని వైయస్‌ఆర్‌సీపీ మచిలిపట్నం పార్లమెంటు అభ్యర్థి వల్లభనేని బాలశౌరి అన్నారు.  గత ఎన్నికల్లో తల్లి కాంగ్రెస్,పిల్ల కాంగ్రెస్‌ అంటూ  వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు నేడు సోనియాగాంధీ,రాహుల్‌గాంధీలకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి దండాలు పెడుతున్నారని విమర్శించారు. రాష్ట్రానికి ఏమి చేయలేని చంద్రబాబు రాష్ట్రానికి ఏవిధంగా పెద్దకొడుకు అవుతాడని ప్రశ్నించారు. చంద్రబాబు ఆయన మనవడు పుట్టగానే 75 కోట్లు బ్యాంకుల్లో డిపాజిట్లు చేశాడని, రాష్ట్రంలో నిరుద్యోగులకు ఒకరికి కూడా 2వేల రూపాయలు భృతి ఇవ్వలేదన్నారు.వచ్చే ఎన్నికల్లో వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సీఎం కావడం ఖాయమని తెలిపారు.

 

Back to Top