టీడీపీ బెదిరింపుల‌కు భ‌య‌ప‌డే ప్ర‌స‌క్తే లేదు

వైయ‌స్ఆర్‌సీపీ నేత అవంతి శ్రీ‌నివాస్‌

విశాఖ‌: తెలుగుదేశం పార్టీ బెదిరింపులకు పాల్పడుతోందని, ఈ బెదిరింపులకు ఎవరూ భయపడరని, అవసరమైతే చావడానికైనా సిద్ధంగా ఉన్నానని వైయ‌స్ఆర్‌సీపీ నేత అవంతి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం ఆయన విశాఖలో విలేకరులతో మాట్లాడుతూ... టీడీపీలో చేరకపోతే సింహాచలం భూములు తీసుకుంటామని ప్రజలను బెదిరిస్తున్నారన్నారు. సింహాచలం భూములే ప్రధాన సమస్యగా పోరాడతానని, పంచగ్రామాల సమస్యను ఎన్నికల స్టంట్‌గా తెరపైకి తెచ్చారన్నారు. టీడీపీ హయాంలో భీమిలి ప్రజలు అనేక ఇబ్బందులెదుర్కొన్నారని ఆయన అన్నారు.

Back to Top