మంత్రి గంటాకు నైతిక విలువలు లేవు...

మంత్రి గంటాకు నైతిక విలువలు లేవు...

నేను ఎవరికి భయపడను..

స్వార్థ రాజకీయాలు కోసం పార్టీ మారలేదు..

మాటమీద నిలబడే వ్యక్తి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి

వైయస్‌ఆర్‌సీపీ నేత అవంతి శ్రీనివాస్‌

విశాఖపట్నం:మంత్రి గంటా శ్రీనివాసరావుకు నైతిక విలువలు లేవని వైయస్‌ఆర్‌సీపీ నేత అవంతి శ్రీనివాస్‌ మండిపడ్డారు.విశాఖపట్నంలో మీడియాతో ఆయన మాట్లాడారు.గంటా వ్యాఖ్యలను ఆయన ఖండించారు.స్వార్థ రాజకీయాలు కోసం పార్టీ మారలేదని తెలిపారు.టీడీపీ నేతలది నమ్మించి మోసం చేసే గుణం అని విమర్శించారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు మంత్రి గంటా..నీతులు వల్లిస్తున్నారన్నారు.ఎథిక్స్‌ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు, ఆయన నీతి గురించి భీమిలిలో ఎవరిని అడిగిన బెబుతారన్నారు. అనాడు అనకాపల్లి ఎమ్మెల్యేగా,మంత్రిగా ఉన్న గంటా.. బీమిలి ఎందుకు రావాల్సివచ్చిందని ప్రశ్నించారు. నేను భీమిలి ఎమ్మెల్యే సీటు అడిగితే..ఎంపీగా అనకాపల్లి ఎందుకు పంపించారో సమాధానం చెప్పాలన్నారు. వెంకట్రామయ్యకు,కన్నబాబు రాజుకు సీట్లు ఇప్పిస్తామని చెప్పి ఎందుకు ఇప్పింలేకపోయారని ప్రశ్నించారు.

గంటా లాగా మోసం చేసే వ్యక్తిని కాదన్నారు.తెలంగాణలో ఆస్తులు ఉన్నాయని..అందుకు భయపడ్డానని తెలుగుదేశం నాయకులు వ్యాఖ్యలను ఖండించారు. నేను ఎవరికి భయపడనని, ప్రధాని మోదీకే భయపడలేదనని తెలిపారు. పార్లమెంటులో మోదీని మెట్టమొదట వ్యతిరేకించిన వ్యక్తిని నేనేనని తెలిపారు. స్వార్థ రాజకీయాలు కోసం పార్టీ మారానని టీడీపీ ప్రచారాన్ని తప్పబట్టారు.అసెంబ్లీలో ప్రతిపక్షం ఉండటం ఓర్వలేక..23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి.. వారిలో కొందరికి మంత్రి పదవులు ఇవ్వడం స్వార్థం కాదా అని ప్రశ్నించారు. మీరు చేస్తే నీతి..వేరే వ్యక్తులు చేస్తే చెడ్డదా అని ప్రశ్నించారు.నేను తెలుగుదేశం పార్టీలోకి వస్తానని  ఎప్పుడూ చెప్పలేదని..టీడీపీ అధిష్ఠానమే నన్ను పిలిచిందని తెలిపారు. నమ్మి పార్టీలోకి వెళ్ళితే నమ్మించి మోసం చేశారని తెలిపారు. లోకేష్‌.. గంటాతో జాగ్రత్తగా ఉండాలని..గంటా లక్ష్యం భీమిలి కాదని...అమరావతి అని, చంద్రబాబులాగా పోరాటాలు చేయకుండా ముఖ్యమంత్రి అవ్వాలని గంటా లక్ష్యమని ఎద్దేవా చేశారు.

భీమిలి ప్రజానీకాన్ని గంటా ఒక పురుగులా చూస్తున్నారని..ఎక్కడ పోటీ చేసినా డబ్బులతో గెలవవచ్చు అని  గంటా భావిస్తున్నారన్నారు. నేడు ఆ పరిస్థితి లేదని..గంటా గురించి ప్రజలందరికి తెలుసునన్నారు. దయ చేసిన నా జోలికి రావద్దని, మీ పరిధిలో మీరు ఉండాలని గంటా శ్రీనివాస్‌ను హెచ్చరించారు. ఎవరు పని వారు చేసుకుందామని హితవు పలికారు. గంటా ఎథిక్స్‌ గురించి మాట్లాడలాంటే అందరికంటే బాగా అయ్యన్న పాత్రుడు మాట్లాడతారని తెలిపారు.తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు గంటా అనే పామును జేబులో పెట్టుకుని తిరుగుతున్నారన్నారు. జిల్లా మంత్రిగా ఉండి..ఐదు సంవత్సరాల్లో ఒక రోజు కూడా సమన్వయ సమావేశానికి గంటా హాజరుకాలేదన్నారు. సాక్షాత్తూ గంటా సహచర మంత్రే ఆయనపై సిట్‌ వేయాలని ఫిర్యాదు చేశారని గుర్తుచేశారు. అలాంటి వ్యక్తి పార్టీ గౌరవం గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు.ముందుగా వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుకోవాలన్నారు. సుమారు 8 నెలలు వేచి చూశారన్నారు. ఈ రోజు వచ్చిన గాని అవకాశం కల్పించారన్నారు.ఇచ్చిన మాట ఎన్ని సంవత్సరాలైనా నిలబెట్టుకునే వ్యక్తి వైయస్‌ జగన్‌ అని  అన్నారు.

 

 

Back to Top