తెలుగుదేశం బీసీ వ్యతిరేక పార్టీ

తిరుపతి:మూడు రోజులుగా నాపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ బీసీ నేత అన్నా రామచంద్రయ్య మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడారు. వెంకటాపురంలో 100 ఎకరాలు ఆక్రమణ చేశానని, మహిళలను అడ్డు పెట్టుకుని దందాలు చేస్తున్నాననే ఆరోణపలు అవాస్తవం అన్నారు. 27 ఏళ్లుగా టీడీపీలో ఉన్నప్పుడు భూకబ్జా దారుడికిగా కనిపించలేదా అని ప్రశ్నించారు.వైయస్‌ఆర్‌సీపీలో చేరగానే భూ కబ్జాదారుడిని అయ్యానా అని ప్రశ్నించారు.ఏ ఒక్క సెంట్‌ భూమి కబ్జా చేయలేదని, నిరూపించాలన్నారు.నన్ను ఎదుర్కోలేకే పీడీ యాక్ట్‌ పెడతామని బెదిరిస్తున్నారన్నారు. తెలుగుదేశం బీసీ వ్యతిరేక పార్టీ అని అన్నారు.చంద్రబాబు అడ్డమైన హామీలు ఇచ్చి మోసం చేస్తే ఎలా నమ్మమంటారని ప్రశ్నించారు.బీసీ అనే వ్యక్తి భూములు కొనుగోలు చేయకూడదా,పైకి రాకూడదా అని ధ్వజమెత్తారు.రాష్ట్రంలోని 13 జిల్లాలో బీసీ కమిటీలున్నాయని,బీసీల మద్దతు వైయస్‌ఆర్‌సీపీకేనని,వైయస్‌ఆర్‌సీపీని గెలిపిస్తామని తెలిపారు.

Back to Top