శ్రీకాకుళం: రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్యోగుల పక్షపాతి అని, క్యాబినెట్ లో విప్లవాత్మక నిర్ణయాలతో మరోసారి రుజువు చేసుకున్నారని వైయస్ఆర్‌సీపీ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి స్పష్టం చేశారు. జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర కళింగ కోమటి కార్పొరేషన్ చైర్మన్ అంధవరపు సూరిబాబు తదితరులతో కలిసి కృపారాణి మాట్లాడారు. అధికారం.. చుర్చీ కోసం ఎన్ని అబద్ధాలైనా ఆడగల అనైతిక నాయకుడు చంద్రబాబు అని కౄపారాణి మండిపడ్డారు. ప్రజల్లో ఉద్యోగులు కూడా భాగస్వామ్యం అని, వారి సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రంలో జగన్‌మోహనరెడ్డి పాలన సాగిస్తున్నారని కృపారాణి స్పష్టం చేశారు. క్యాబినెట్ లో ముఖ్యమంత్రి తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాల పట్ల ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని కౄపారాణి తెలిపారు. క్యాబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలపై జిల్లా, రాష్ట్రస్థాయి ఉద్యోగ సంఘ నాయకులతో మాట్లాడనని వారంతా ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలను స్వాగతిస్తున్నారని చెప్పారు. ఫెన్షన్‌తో ఉద్యోగ భద్రత ఉంటుందని భావించి ఉద్యోగుల ప్రయోజనం కోసం సీపీఎస్ స్థానంలో జీపీఎస్ విధానాన్ని అమలు చేసి వే ఆఫ్ హోప్ ఉద్యోగుల్లో సంతోషాన్ని నింపారని ఆమె తెలిపారు. ఉద్యోగ విరమణ అనంతరం ఉద్యోగి చివరి నెలలో మూలవేతనంతో 50 శాతం ఫెన్షన్, ప్రతి ఆర్నెళ్లకు ఒకసారి కరువు భత్యం ఇవ్వడం ద్వారా మెరుగైన ఫెన్షన్‌ను అందించనున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఆదర్శవంతమైన నిర్ణయాలు మిగిలిన రాష్ట్రాలు స్వాగతిస్తున్నాయన్నారు. అదే విధంగా క్యాబినెట్‌లో 10వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసులు రెగ్యులరైజేషన్ చేయడానికి నిర్ణయం తీసుకున్నారన్నారు. అదే విధంగా కొత్తగా అన్ని శాఖల్లోనూ 6,845 కొత్త ఫోస్టుల్లో ఉద్యోగాల భర్తీ చేసేందుకు క్యాబినెట్ కమిటీ నిర్ణయించిందన్నారు. 1986లో స్థాపించిన వైద్య విధాన పరిషత్‌ను ప్రభుత్వంలోకి విలీనం చేసి వారికి ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులుగా వారి గౌరవం పెంచేలా సీఎం జగన్ మోహనరెడ్డి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. 010 పద్దు ద్వారా వారికి వేతనాలు చెల్లించేందుకు క్యాబినెట్‌లో తీసుకున్న నిర్ణయం పట్ల వైద్య, ఉద్యోగ వర్గాల్లో సంతోషం వ్యక్తంమవుతోందన్నారు. 12వ పీఆర్‌సీకి సంబంధించి ప్రకటన , 11వ పీఆర్‌సీకి సంబంధించి విడతల వారీగా బకాయిలు చెల్లించేందుకు క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకోవడంతో ఉద్యోగ వర్గాల్లో పండగ వాతావరణం కన్పిస్తోందన్నారు. సంక్షేమం తప్ప రాష్ట్రంలో అభివౄద్ధి జాడ లేదని అదే పనిగా విమర్శలు చేస్తూ దుష్ప్రచారం చేస్తున్న చంద్రబాబు ఇటీవల విడుదల చేసిన 2024 ఎన్నికల మ్యానిఫెస్టోలో నోటికి వచ్చిన హామీలు ఇచ్చారని, అవి ఎలా అమలుకు సాధ్యమో ప్రజలకు చెప్పాలన్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా జగన్‌మోహనరెడ్డి ఒక అడుగు ముందుకు వేసి తండ్రి కంటే మిన్నగా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను 98.5 శాతం హామీలను అమలు చేశారని కృపారాణి కితాబిచ్చారు. క్యాబినెట్ లో తీసుకున్న నిర్ణయాలతో ఉద్యోగ వర్గాలంతా జగన్ మోహన్‌రెడ్డి నాయకత్వం పట్ల సంపూర్ణ విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారని ముఖ్యమంత్రిగా మీరే కొనసాగాలన్న అభిప్రాయం వారి మాటల్లో వ్యక్తమవుతోందని ఆమె వివరించారు. ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయిన చంద్రబాబు ఎన్ని హామీలిచ్చినా ప్రజలు నమ్మరని అధికారంలోకి రాలేరని ఆమె తెలిపారు. జనసేన నాయకులు టీడీపీ దయతో ఇచ్చిన 10-15 సీట్లు చాలనుకొని రాష్ట్రంలో పరిమిత స్థానాల్లో పోటీ చేసి వైయస్ జగన్‌మోహనరెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా కానివ్వకుండా చేయడమే లక్ష్యం తప్ప రాష్ట్ర భవిష్యత్ చూసే నాయకత్వ లక్షణాలు లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని ఎద్దేవా చేశారు. ఎటువంటి నాయకత్వ లక్షణాలు లేని, ముఖ్యమంత్రి అయ్యే అర్హతలు సైతం లేని వ్యక్తి వెంట జనసేన కార్యకర్తలు, నాయకులు వెంట తిరిగి వారి జీవితాలను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. సమావేశంలో వైయస్ఆర్‌సీపీ నాయకులు శిమ్మ రాజశేఖర్, ఎన్ని ధనుంజయ, డబ్బీరు శ్రీనివాస్ పట్నాయక్, ఎంఎ బేగ్, ఎంఎ రఫీ, గుంట జ్యోతి, అల్లిబిల్లి రాధ తదితరులు పాల్గొన్నారు.