చంద్రబాబు మొసలికన్నీళ్లు ప్రజలు నమ్మరు..

వైయస్‌ఆర్‌సీపీ నేత అనంత వెంకట్రామిరెడ్డి

అనంతపురం: ఏపీకి అన్యాయం జరిగిందంటూ ముఖ్యమంత్రితో పాటు అ«ధికార పార్టీ నేతలు నిరసన తెలపడం దొంగే..దొంగ దొంగ అన్నట్లుందని మాజీ ఎంపీ,అనంతపురం అర్బన్‌ వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త అనంత వెంకటరామిరెడ్డి ఎద్దేవా చేశారు. ప్రత్యేకహోదా,విభజన చట్టం హామీలు అమలు విషయంలో తమ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముందు నుంచీ ఒకే మాట మీద ఉన్నారన్నారు.

అవిశ్వాస తీర్మానం పెడితే కనీసం మద్దతు ఇవ్వని పరిస్థితి టీడీపీదని మండిపడ్డారు. ప్రధాని వద్దకు వెళ్దామని చెబితే అవహేళన చేశారన్నారు.చంద్రబాబు అనుసరించిన నీచ రాజకీయాలతోనే రాష్ట్రానికి ఇలాంటి దౌర్భగ్యమైన పరిస్థితి ఏర్పడిందన్నారు.ఎన్నికలు సమీపిస్తున్నందునే చంద్రబాబు..బీజేపీ అన్యాయం చేసిందని మొసలికన్నీరు కారుస్తున్నారన్నారు.

 

Back to Top