వ్యక్తిత్వ హననం చంద్రబాబు స్వభావం..

ఫెడరల్‌ ఫ్రంట్‌పై చర్చలు జరిపితే ఎందుకంత శోకాలు..

వైయస్‌ఆర్‌సీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు..

విజయవాడ: వ్యక్తిత్వాలను దెబ్బతీయడం ద్వారా మాత్రమే రాజకీయాల్లోకి పైకిరావాలనే నీచమైన మనస్తత్వం ఉన్న  వ్యక్తి చంద్రబాబు అని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. విజయవాడ వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు చరిత్ర రాష్ట్ర ప్రజలందరికి అందరికి తెలుసునని, ఎన్టీఆర్‌ కూర్చి లాక్కోవడానికి ఎంత వ్యక్తిత్వం హననం చేశారో తెలియని విషయం కాదన్నారు. ఎదురువారిపై బురద చల్లి రాజకీయ లబ్ధిపొందాలనే నీచమైన స్వభావం కలిగిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు.

వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సోదరి షర్మిలపై విష ప్రచారం చేసి అపవాదులు వేయడం దుర్మార్గమన్నారు. దివంగత మహానేత వైయస్‌ఆర్‌ మరణం తర్వాత ఆయన తనయుడు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని టీడీపీ,కాంగ్రెస్‌లు కలిసి వేధింపులకు గురిచేసి,  చివరికి 16 నెలలు జైల్లో పెడితే ఆయన చెల్లెలు షర్మిల పాదయాత్ర చేసి వైయస్‌ఆర్‌సీపీని కాపాడారని గుర్తు చేశారు. అలాంటి మహిళ మీద దుషప్రచారం చేయడం దారుణం.చంద్రబాబు నాయకత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీ పనిగట్టుకుని దుష్ప్రచారం చేయడం నీచమైన చర్య అని అన్నారు.చేసిన తప్పులకు  ఫ్రతిఫలం అనుభవిస్తారన్నారు. వైయస్‌ జగన్‌ను వేధింపులకు గురిచేసినా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతూ ఉంటే  ఆయనపై హత్యాయత్నానికి కూడా తెలుగుదేశం ప్రభుత్వం పాల్పడిందని, హత్యాయత్నం కేసుపై  విచారణ జరుగుతుంటే చంద్రబాబు ఎందుకు గగ్గొలు పెడుతున్నారన్నారు.

వాస్తవాలు బయటకు వస్తాయని వణుకుపోతున్నారన్నారు. వ్యక్తిత్వాలను హననం చేసే కార్యక్రమాలు చంద్రబాబు చేస్తున్నారని  ప్రజలు గమనించాలని కోరారు. హైదరాబాద్‌లో ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరుతో ఒక రాజకీయ పరిణామం జరిగిందని, ఉత్కంఠగా తెలుగు ప్రజలతో పాటు రాజకీయ మేథావులు కూడా  ఉత్కంఠగా చూస్తే..మరోపక్క  తెలుగుదేశం పార్టీ శోకాలు పెడుతుందని విమర్శించారు.ఇష్టమొచ్చినట్లు టీడీపీ మంత్రులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జరుగుతున్న పరిణామంపై  తెలుగుదేశం మాట్లాడుతున్న ధోరణి ఖండించారు. టీఆర్‌ఎస్‌తో కలిసి ఆంధ్రరాష్ట్రంలో పోటీ చేస్తున్నామా..పొత్తు వెంపర్లాడుతున్నామా అని ప్రశ్నించారు. ఒక జాతీయ వేదికను ఏర్పాటు చేయాలనే భావన టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ భావించారని, .రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటానికి ఫెడరల్‌ ఫ్రంట్‌ అని పెట్టి దేశవ్యాప్తంగా తిరుగుతున్నారని, అదే క్రమంలో మేం కూడా మీతో కలుస్తాం,మీతో చర్చిస్తాం అని కేసీఆర్‌ వైయస్‌ జగన్‌కు  ఫోన్‌ చేసి కేటీఆర్‌ బృందాన్ని పంపుతున్నాం అని చెప్పారు. దానికి వైయస్‌ జగన్‌ మర్యాదపూర్వకంగా ఆహ్వానించి చర్చలు జరిపారని,దానిలో అంశాలను వైయస్‌ జగన్‌ వివరించారన్నారు. ఈ విషయం మేథావులకు, ప్రజలకు అందరి తెలుసు అని అన్నారు.  కేసీఆర్,టీఆర్‌ఎస్‌ గాని ఆంధ్రరాష్ట్రంలో పోటీ చేయడం లేదు. వైయస్‌ఆర్‌సీపీతో పొత్తు పెట్టుకోవడం అంతకంటే లేదు. ఇప్పుడు జరుగుతున్న పరిణామం ఏమిటంటే తెలంగాణలో వారికి కొన్ని సీట్లు ఉన్నాయి.

ఆంధ్రలో మాకు కొన్ని సీట్లు ఉన్నాయి.పోటీచేసిన తర్వాత జాతీయ స్థాయిలో ఒక ఫెడరల్‌ ఫ్రంట్‌ను ఏర్పాటుచేసుకుని కేంద్ర ప్రభుత్వంతో వచ్చే నిధులను,హక్కులను విషయంలో కలిసిమెలిసి ఉండాలి అనే ప్రతిపాదన పరిశీలను వచ్చింది. దానిలో భాగంగా ప్రత్యేకహోదాకు ఫెడరల్‌ ఫ్రంట్‌ సహకరిస్తుందని సాక్షాత్తూ కేసీఆరే తెలిపారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వడం ధర్మం అని చెప్పిన తర్వాత భోజనం పెట్టి చర్చిస్తే తప్పా అని ప్రశ్నించారు. అన్యాయామా అని అన్నారు.  తెలంగాణకు ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారంటూ,కేసులకు భయపడి కేసీఆర్‌తో కలిసిపోతున్నారంటూ ఇష్టవచ్చినట్లు టీడీపీనేతలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకున్నారు. ఓడిపోయారు. కాంగ్రెస్‌తో వెళ్లక ముందు చంద్రబాబు కేసీఆర్‌తో పొత్తుకు ప్రయత్నించారు.

కేసీఆర్‌ పొత్తుకు ససేమీరా అన్నారు.దీంతో చంద్రబాబు కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకున్నారన్నారు. ఆ వ్యక్తే నేడు కేసీఆర్‌తో చర్చలు జరపడం తప్పు అనడం ప్రజలు గమనించాలన్నారు. వైయస్‌ఆర్‌సీపీ కేసీఆర్‌తోనే పొత్తు పెట్టుకోవడానికి వెళ్లడంలేదని ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలన్నారు.175 సీట్లలో దైర్యంగా పోటీచేసే శక్తి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి ఉందన్నారు. కేసీఆర్,కేటీఆర్‌తోను చర్చలు జరుపుతున్నది దేశవ్యాప్తంగా ఒక వేదికను ఏర్పాటు చేయడానికి, దీనిపై చర్చలు జరపడానికి వచ్చినప్పుడు గౌరవంగా ఆహ్వానించి చర్చలు జరుపుతుంటే చంద్రబాబు ఎందుకు  గంగవె్రరులెత్తిపోతున్నారని ప్రశ్నించారు..ఏనుగు వెళ్తుంటే కుక్కలు మెరిగినట్లు టీవిలో ఎందుకు మెరుగుతారని విమర్శించారు. కేసీఆర్‌ అలాంటివారు,ఇలాంటివారు అని ఆరోపణలు చేస్తున్న టీడీపీనేతలు  తెలంగాణలో ఎన్నికల్లో పొత్తులు కోసం చంద్రబాబు.. కేసీఆర్‌ను ఎందుకు అడిగారని ప్రశ్నించారు. మీరు ఎందుకు కేసీఆర్‌ కాళ్లు పట్టుకోవడానికి ప్రయత్నం చేశారో సమాధానం చెప్పాలన్నారు.

చంద్రబాబు పొత్తులు పెట్టుకుంటే అది రాజకీయ ప్రయోజనాలు,రాష్ట్ర ప్రయోజనాలా...వైయస్‌ఆర్‌సీపీ చర్చలు జరిపితే తాకట్టు పెట్టినట్లా..ఏమిటీ అన్యాయం అని అన్నారు..ప్రత్యేకహోదా కోసం మొట్టమొదటి నుంచి పోరాటం చేస్తుంది వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మాత్రమే అని ఆయన నాయకత్వంలోనే ఏపీ ప్రత్యేకహోదా సాధిస్తుందని తెలిపారు.

 

 

తాజా వీడియోలు

Back to Top