అవినీతి, అక్రమాలకు టీడీపీ అడ్డా  

వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి ఆమంచి కృష్ణమోహన్‌

టీడీపీని రద్దు చేయాలంటూ చీరాలలో భారీ ప్రదర్శన

ప్రకాశం: అవినీతి, అక్రమాలకు తెలుగు దేశం పార్టీ అడ్డాగా మారిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి ఆమంచి కృష్ణమోహన్‌ మండిపడ్డారు. అవినీతికి అడ్డాగా మారిన తెలుగు దేశం పార్టీ గుర్తింపు రద్దు చేయాలని కోరుతూ ఆమంచి ఆధ్వర్యంలో చీరాలలో భారీ ప్రదర్శన చేపట్టారు. స్థానిక ముక్కోణం పార్క్ కూడలిలోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌  బి .ఆర్ . అంబేద్కర్ విగ్రహానికి ఆమంచి తో పాటు పలువురు నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణమోహన్‌ మాట్లాడుతూ..ప్రకాశం జిల్లాలో మైనింగ్ శాఖ కి రెండువేల కోట్లు పైగా పన్నులు, రాయల్టీ లు కట్టకుండా టీడీపీ నేతలు ఎగ్గొట్టారని మండిపడ్డారు.  ప్రజా ధనం లూటీ చేసిన ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ టీడీపీ మంత్రులు, టీడీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఐటీ దాడులలో బట్ట బయలు అయిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ ల రెండువేల కోట్ల అక్రమ ఆస్తులు, లావా దేవీల బాగోతం ప్రజలకు తెలిసిపోయిందన్నారు.  కొద్దిరోజుల క్రితం చంద్రబాబు వ్యక్తిగత వ్యవహారాలు చూసే పీఏ శ్రీనివాసతో పాటు మరికొందరి పైన దర్యాప్తు సంస్థలు తనిఖీలు చేస్తే వారి దగ్గర స్థాయికి మించి నగదు, బంగారం దొరికిన మాట వాస్తవమన్నారు. వీరంతా కూడా చంద్రబాబు బినామీలే అన్నారు.  రూ. 2000 కోట్ల కు పైగా అవినీతి జరిగినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థలు  పేర్కొంటే ఎల్లోమీడియాకు ఇవేవి కనిపించడం లేదన్నారు.  తనకు మైనింగ్, గ్రానెట్స్ తో సంబంధాలు లేవు అన్ని చెప్పే చీరాల నియెజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే బలరాం, కేబీ రాక్స్ పేరిట సుమారు రూ.32 కోట్ల మేర రాయల్టీలను ఎగ్గ్గొడితే సంబంధిత అధికారులు నోటీసులు జారీచేసిన మాట వాస్తవమా ...? కదా ..? అని సూటిగా ప్రశ్నించారు.   కురుచేడు, మొన్నలూరు రైతులను బెదిరించి పెద్ద మొత్తంలో భూములను ఆక్రమించి వ్యవసాయం చేస్తున్నారని పేర్కొన్నారు.  కరణం బలరాం అద్దంకి  ఇంచార్జ్ గా ఉన్న సమయంలో ప్రజా పంపిణికి వినియెగించే రేషన్ బియ్యాన్ని మేదరమెట్లలో ఓ రేస్ మిల్లు  అద్దెకు తీసుకొని రీసైక్లింగ్ చేసి నల్లబజార్ లో అమ్ముకున్నారన్నారు. టీడీపీ నేతల అక్రమాలపై విచారణ చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో చీరాల వ్యవసాయ మార్కెట్ చైర్మన్‌ మార్పు గ్రెగొరీ, మాజీ మున్సిపల్ చైర్మన్‌ రమేష్ బాబు , శవనం సుబ్బారెడ్డి, గోలి అంజలి దేవి, వెంకట్రావ్, న్యాయవాది కర్నేటి రవి , బాజీ బాబు, మాజీ కౌన్సిలర్లు గుద్దంటి సత్యనారాయణ , కడలి జగదీష్, సుభాని,శ్యామ్ సన్ , శీలం శ్యామ్ , డేటా దివాకర్, చెల్లి బాబు, సాయిల వాసు, కొమ్మనబోయిన శివ , పందరో బోయిన  కృష్ణ, దుర్గారావు , జిల్లా పార్టీ కార్యదర్శి చింత శ్రీను పాల్గొన్నారు .

తాజా ఫోటోలు

Back to Top