వైయ‌స్‌ జగన్‌ను గెలిపించి సీఎంను చేద్దాం 

 వైయ‌స్ఆర్‌ సీపీ నాయకుడు, ప్రముఖ సినీ నటుడు అలీ 
 

 నెల్లూరు: దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి అంటే తనకు చాలా ఇష్టమని వైయ‌స్ఆర్‌ సీపీ నాయకుడు, ప్రముఖ సినీ నటుడు అలీ తెలిపారు. గురువారం ఆర్‌ఎస్‌ఆర్‌ కల్యాణ మండపంలో జరిగిన కావలి నియోజకవర్గ ముస్లింల ఆత్మీయ సమ్మేళనంలో అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎందరో పేదలను పార్టీలకు అతీతంగా వైయ‌స్ఆర్‌ ఆదుకున్నారని పేర్కొన్నారు.  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట ఇస్తే తప్పరని తెలిపారు. రాష్ట్రానికి జగన్‌ రావాలి-జగన్‌ కావాలి అని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌కు వైయ‌స్‌ జగన్‌ అవసరం ఎంతో ఉందన్నారు. భగవంతుడు ఉన్నాడని.. మంచి రోజులు వస్తాయని అన్నారు. త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుందని తెలిపిన ఆయన.. ఈ ఎన్నికల్లో వైయ‌స్‌ జగన్‌ను గెలిపించి సీఎంను చేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు 

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top