రాజన్న రాజ్యం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

వైయస్‌ఆర్‌సీపీ నేత ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి

వైయస్‌ జగన్‌కు తోడుగా ఉందాం

వైయస్‌ఆర్‌ జిల్లా: దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి రాజ్యం తెచ్చుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వైయస్‌ఆర్‌సీపీ నేత ఆకేపాటి  అమర్‌నాథ్‌రెడ్డి అన్నారు. కడప శంఖారావం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..గత పాలకులు ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. సుదీర్ఘ పాదయాత్రలో వైయస్‌ జగన్‌ ఎన్నో సమస్యలు తెలుసుకున్నారు. రాష్ట్రంలో రాజన్న పాలన తెచ్చేందుకు వైయస్‌ జగన్‌ కృషి చేస్తున్నారు. ఈ జిల్లా వైయస్‌ఆర్‌ జిల్లా అని, ఈ జిల్లా వైయస్‌ రాజశేఖరరెడ్డికి జన్మనిచ్చిన గడ్డ అన్నారు.

ఈ ప్రాంతం అంతా కూడా కరువు కాటకాలతో అల్లాడుతున్న సమయంలో వైయస్‌ఆర్‌ ముఖ్యమంత్రి అయి జిల్లాకు సాగునీరు, తాగునీరు ఇచ్చారన్నారు. వైయస్‌ఆర్‌ మరణం మనకు దురదృష్టకరమన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపించిన గొప్పనేత వైయస్‌ఆర్‌ అన్నారు. వైయస్‌ జగన్‌ ఈ రాష్ట్రానికి నేనున్నానని వైయస్‌ఆర్‌సీపీని స్థాపించారన్నారు. ఈ జిల్లావాసులంతా వైయస్‌ జగన్‌ వెంట నడుస్తున్నారన్నారు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రంతో పాటు జిల్లా అభివృద్ధి సాధిస్తుందన్నారు. వైయస్‌ జగన్‌కు అందరం తోడుగా ఉందామని పిలుపునిచ్చారు.
 

Back to Top