చంద్రమౌళి మృతికి సీఎం వైయస్‌ జగన్‌ సంతాపం

తాడేపల్లి: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ కె.చంద్రమౌళి శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో అనారోగ్యంతో మృతి చెందారు. చంద్రమౌళి మృతి పట్ల ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. వైయస్‌ఆర్‌సీపీకి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. కలెక్టర్‌గా, రాజకీయ నేతగా అందించిన సేవలను ప్రజలు చిరకాలం గుర్తు పెట్టుకుంటారన్నారు. చంద్రమౌళి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని దేవున్ని ప్రార్థిస్తున్నట్లు సీఎం వైయస్‌ జగన్  పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.  
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top