మ‌ళ్లీ వైయ‌స్ఆర్‌సీపీ జెండా ఎగురవేద్దాం

వైయ‌స్ఆర్‌సీపీ కాకినాడ పార్ల‌మెంట్ స‌మ‌న్వ‌య‌క‌ర్త చ‌ల‌మ‌శెట్టి సునీల్‌

జగ్గంపేటలో సునీల్‌కు ఘ‌న స్వాగ‌తం

కాకినాడ‌:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నాయ‌క‌త్వంలో ఐక్యంగా ప‌ని చేసి రాష్ట్రంలో మ‌ళ్లీ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగుర‌వేద్దామ‌ని వైయ‌స్ఆర్‌సీపీ కాకినాడ పార్ల‌మెంట్ స‌మ‌న్వ‌య‌క‌ర్త చ‌ల‌మ‌శెట్టి సునీల్ పిలుపునిచ్చారు. జగ్గంపేట నియోజకవర్గ కేంద్ర సెంటర్లో ఏర్పాటైన దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి చలమలశెట్టి సునీల్ పూలమాల వేసి నివాళులర్పించారు. జగ్గంపేటకు విచ్చేసిన ఆయనకు పార్టీ వైయస్ఆర్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రామచంద్రాపురం   పార్టీ పరిశీలకులు, కాకినాడ జిల్లా జె సి యస్ కో ఆర్డినేటర్ ఒమ్మి రఘురామ్ ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి, పూలమాలతో, పార్టీ కండువలతో స్వాగతం పలికారు. అనంత‌రం పలువురు పార్టీ నాయకులను సునీల్‌కు రఘురామ్ పరిచయం చేశారు. ఈ సంద‌ర్భంగా సునీల్ మాట్లాడుతూ ..ఈ ఎన్నికలలో ప్రజలందరూ మరొకసారి వైయస్ఆర్ సీపీకి మద్దతు ఇచ్చి జగనన్న ను ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. కాకినాడ పార్లమెంట్ నుంచి తనను గెలిపించి నియోజకవర్గ ప్రజలకు సేవచేసుకొనే భాగ్యం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ముత్యాల శ్రీనివాసు, ఎంపీటీసీలు గొల్లపల్లి శ్రీను, ఆకుల శ్రీధర్, చెరుకూరి జయరాజు, మండల సేవాదళ్ కన్వీనర్ కీలపర్తి వీరబాబు, టౌన్ ప్రెసిడెంట్ కాపవరపు ప్రసాద్, పార్టీ నాయకులు పెద్దాడ రాజబాబు,రెడ్డి భాను ప్రతాప్, నీలపల్లి అప్పారావు,పచ్చిపులుసు వీరబాబు,దత్తి శ్రీనివాసు, సప్పా రఘునాధ్,కొండ్రోతు పైడియ్య,సాకా రాజ్ కుమార్ , పలువురు నాయకులు, కార్యకర్తలు  పాల్గొన్నారు. సునీల్ గారి వెంట పాము సూరిబాబు, కొట్టు శివరామకృష్ట పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Back to Top