ఘనంగా కాకినాడ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ ప్లీనరీ

కాకినాడ : వైయ‌స్ఆర్‌ సీపీ కాకినాడ జిల్లా ప్లీనరీ మంగళవారం సాయంత్రం కాకినాడ రూరల్‌ పరిధిలోని నడకుదురులో పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కురసాల కన్నబాబు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ప్లీనరీకి భారీఎత్తున వైయ‌స్ఆర్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు హాజరుకాగా.. ఆరు అంశాలపై తీర్మానాలు చేశారు.

ముఖ్య అతిథులుగా కాకినాడ జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీదిరి అప్పలరాజు, మంత్రులు దాడిశెట్టి రాజా, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎంపీ, ఉభయ గోదావరి జిల్లాల పార్టీ రీజనల్‌ కో–ఆర్డినేటర్‌ పిల్లి సుభాష్‌చంద్రబోస్, పరిశీలకురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, ఎంపీ వంగా గీత, జెడ్పీ చైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.  

Back to Top