పోటెత్తిన విజ‌య‌వాడ‌

జ‌య‌హో బీసీ నినాదాల‌తో ద‌ద్ద‌రిల్లుతున్న ఇందిరాగాంధీ మున్పిప‌ల్ స్టేడియం

వేలాదిగా త‌ర‌లివ‌చ్చిన బీసీ ప్ర‌జాప్ర‌తినిధులు

విజ‌య‌వాడ‌:  వైయ‌స్ఆర్‌సీపీ జ‌య‌హో బీసీ మహాసభ విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ప్రారంభం అయ్యింది. ‘వెనుకబడిన వర్గాలే వెన్నెముక’ నినాదంతో బుధవారం నిర్వహిస్తున్న మహాస­భకు రాష్ట్ర న‌లుమూల‌ల నుంచి పెద్ద ఎత్తున బీసీ ప్ర‌జాప్ర‌తినిధులు, బీసీ నాయ‌కులు హాజ‌ర‌య్యారు.  జయహో బీసీ.. అంటూ వెనుకబడిన కులాల ప్రతినిధులు ఛలో విజయవాడకు వచ్చారు. నగర పరిసర ప్రాంతాల్లో మహాసభకు వచ్చేవారికి స్వాగతం పలు­కుతూ పెద్ద ఎత్తున పోస్టర్లు ఏర్పాటు చేశారు. బీసీ మహాసభకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి మంగళవారమే బీసీల ర్యాలీలు బయలుదేరాయి. ఉద‌యం 9.30 గంట‌ల‌కే జ‌య‌హో బీసీ కార్య‌క్ర‌మాన్ని బీసీ నేతలంతా కలిసి జ్యోతి ప్రజల్వనతో ప్రారంభించారు. అనంతరం ప్రసంగోపన్యాసం సాగుతోంది.

Back to Top