రాజ్య‌స‌భ‌లో కీల‌క బిల్లుల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్న వైయ‌స్ఆర్ సీపీ

న్యూఢిల్లీ: రాజ్యసభలో నేడు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు కీలక ప్రైవేటు మెంబర్‌ బిల్లుల‌ను ప్రవేశపెట్టనుంది. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలలో భాగంగా శుక్ర‌వారం రాజ్య‌స‌భ‌లో బీసీ జనగణన చేసేలా రాజ్యాంగ సవరణ ప్రైవేటు మెంబర్‌ బిల్లు సహా సెస్‌, సర్‌ఛార్జీల ఆదాయంలో రాష్ట్రాలకు వాటా ఇచ్చేలా మరో బిల్లును వైయ‌స్ఆర్ సీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత విజయసాయి రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. అదే విధంగా మిరప పంట పరిశ్రమ అభివృద్ధి బిల్లును లోక్‌సభలో వైయ‌స్ఆర్ సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రవేశపెట్టనున్నారు.

Back to Top