బీసీల ఆత్మగౌరవం నిలబెట్టిన నాయకుడు సీఎం వైయస్‌ జగన్‌

వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

తాడేపల్లి: బలహీనవర్గాల ఎదుగుదల కోసం ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృషిచేస్తున్నారని వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. బీసీల ఆత్మగౌరవాన్ని సీఎం వైయస్‌ జగన్‌ నిలబెట్టారన్నారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు, కొన్ని దుష్ట శక్తులు చేస్తున్న విష ప్రచారాన్ని అందరం కలిసి తిప్పికొట్టాలన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి హాజరై మాట్లాడారు.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top