తెలంగాణ ప్రభుత్వమే వివాదం సృష్టిస్తోంది

బాబు హయాంలోనే తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు కట్టింది

తెలంగాణ వైఖరి, చంద్రబాబు అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం

నీటి అంశంపై అన్ని వేదికలపై పోరాటం చేస్తాం

వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

తాడేపల్లి: కృష్ణా నీటి కేటాయింపులు ప్రాజెక్టుల వారీగా జరిగాయని, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అడ్డగోలుగా విద్యుత్‌ ఉత్పత్తి చేస్తోందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ అంశంపై అన్ని వేదికలపై పోరాటం చేస్తామని చెప్పారు. కృష్ణా జలాలు, రెండు రాష్ట్రాల వినియోగం, ఏపీ హక్కుల అంశంపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వర్చువల్‌ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో మంత్రులు, ముఖ్య నాయకులు, పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. కృష్ణా జలాలపై వాస్తవంగా ఎలాంటి వివాదం లేదని, తెలంగాణ ప్రభుత్వం కేవలం రాజకీయ కోణంలో వివాదం సృష్టిస్తోందన్నారు. అక్రమంగా పాలమూరు – రంగారెడ్డి కట్టింది తెలంగాణ ప్రభుత్వమేనని, రాయలసీమకు నీళ్లందించేందుకు సహకరిస్తామని గతంలో కేసీఆర్‌ అన్నారని గుర్తుచేశారు. ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు అడ్డుతగులుతున్నారన్నారు. రాయలసీమ లిఫ్ట్‌ ద్వారా కొత్తగా ఆయకట్టుకి నీళ్లివ్వడం లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు హయాంలోనే తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు కట్టిందని, ఆరోజు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దీక్షలు చేసినా చంద్రబాబు మేల్కోలేదన్నారు. ఏపీ రైతుల హక్కులు కాపాడేందుకు సీఎం వైయస్‌ జగన్‌ ప్రయత్నిస్తున్నారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ వైఖరిని చంద్రబాబు చేసిన అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు.  
 

Back to Top