నెల్లూరు జిల్లా: టీడీపీ నేత వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ప్రశాంతి రెడ్డిలకు రాజకీయాలంటే వ్యాపారంగా మారాయని వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి విమర్శించారు. సోమవారం వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, నల్లపురెడ్డి రాజేంద్రకుమార్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. వి.విజయసాయిరెడ్డి ఏమన్నారంటే.. ఓడిపోతే పారిపోయే వారు కావాలా? మీతో ఉండే వాళ్లు కావాలా?: – రాజేంద్ర కుమార్ రెడ్డి, ప్రశాంతిరెడ్డి గారి టెలిఫోన్ సంభాషణ పరిశీలిస్తే ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది. – పెద్దల పట్ల అగౌరవంగా మాట్లాడటం, టీడీపీలో చేరిన తర్వాత ప్రశాంతిరెడ్డి, ఆమె భర్త వేమిరెడ్డి కానీ విజయం సాధించలేకపోతే రాజకీయాల్లో నుంచి నిష్క్రమిస్తాం అనేది స్పష్టమవుతోంది. – దుబాయ్, సింగపూర్, ఇండోనేషియా, ఆఫ్రికా, ఇండియాల్లో వారి వ్యాపార లావాదేవీలు చూసుకుంటారే కానీ ప్రజాజీవితంలో ఉండరు అనేది ఘంటాపథంగా చెప్పొచ్చు. – వారి మనోభావాలనే వారు వ్యక్తపరిచారు. ఇప్పుడు నెల్లూరు ప్రజలే నిర్ణయించుకోవాలి. – మీకు మీ సమస్యలను ఆకలింపు చేసుకుని ఎల్లవేళలా మీతో పాటు, మీ కష్టంలో, నష్టంలో కలసి పనిచేసే వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులు కావాలా? – లేక మేం పోటీచేస్తాం..ఓడిపోతే మా వ్యాపార లావాదేవీలు చూసుకుంటాం అన్నటువంటి టీడీపీ అభ్యర్థులు కావాలా అనేది నిర్ణయించుకోండి. – నెల్లూరు జిల్లా వాసులు మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నా. – ఎప్పుడూ వైఎస్సార్సీపీ అధినేత జగన్ గారు, మా శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు అనునిత్యం ప్రజాజీవితంలోనే ఉంటాం. మేం వదిలేసిన వారిని టీడీపీ అభ్యర్థులుగా పెట్టుకున్నారంటేనే...: – నెల్లూరు పార్లమెంటు పరిధిలోని ఏడు స్థానాలు గెలుస్తాం. – టీడీపీలో నాయకత్వం కొరవడి..పోటీలో నిలబడిన అభ్యర్థులంతా వైయస్ఆర్‌సీపీ నుంచి తీసుకున్న వారే. – కోటంరెడ్డి, ఆనం, వేమిరెడ్డి దంపతులు, కావ్య కృష్ణారెడ్డిలు ఒరిజినల్ తెలుగుదేశమా? – టీడీపీలో నాయకులు లేక..వైయస్ఆర్‌సీపీ నుంచి మేం వదిలేసిన వారిని నిలబెడుతున్నాడా? – టీడీపీలో నాయకత్వ లోపం అనేది స్పష్టంగా కనిపిస్తోంది. – మా పార్టీ అధినాయకుడు జగన్ గారు ఇచ్చిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు 99 శాతం పూర్తి చేశాం. – ఇచ్చిన మాట తప్పకుండా నెరవేర్చిన ఘనత వైయస్ జగన్ గారిది. – ఇవన్నీ ప్రజల మనోభావాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. – సిద్ధం యాత్రలో పేదలు వైయస్ జగన్ గారి పట్ల చూపిస్తున్న ఆదరణ వారి కళ్లలోనే కనిపిస్తోంది. – వారి గుండె లోతుల్లోంచి ప్రేమ, ఆప్యాయత చూస్తే మా లక్ష్యం 175 సీట్లు గెలుస్తామనడంలో సందేహం లేదు. – టీడీపీలో ఎంత గొప్ప నాయకులైనా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా.. వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులే గెలుస్తారు. ప్రశాంతిరెడ్డి ఆడియోను లీక్ చేసిన నల్లపరెడ్డి రాజేంద్రకుమార్ రెడ్డి: – నేను ఒకనాడు రాజకీయాల్లో సంచలనాలకు కేంద్రం అయిన నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి కుమారుడిని. – ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఏడో సారి గెలవడానికి సిద్ధంగా ఉన్న మా అన్న ప్రసన్నకుమార్‌రెడ్డి తమ్ముడిని. – వైయస్ రాజశేఖరరెడ్డి జీవించి ఉన్నప్పటి నుంచీ ప్రస్తుతం జగన్ గారి బాటలో నడుస్తున్న కుటుంబం మాది. – వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి రాజకీయ నిజరూప దర్శనం ఆడియో రూపంలో మీ ముందుకు తీసుకొస్తున్నా. – ఆమె కోవూరు నియోజకవర్గంలో పర్యటిస్తున్నప్పుడు ఒక మాట అన్నారు. నల్లపురెడ్డి శ్రీనివాసులురెడ్డి గారి చెల్లిని ఏ ఇంటికి కోడలుగా పంపారో, అదే ఇంటికి తాను కూడా అదే ఇంటికి కోడలుగా వెళ్లానని చెప్పారు. – ఆఖరికి ఆమె నల్లపురెడ్డి కుటుంబ పేరునే వాడుకోవాల్సిన పరిస్థితి ప్రశాంతికి వచ్చింది. – మా మేనత్త హైమావతి గారు ఒక దేవత. ప్రశాంతి రెడ్డి వారి పేరును ఉచ్చరించే అర్హత కూడా లేదు. – శ్రీథర్‌రెడ్డి మాట్లాడొచ్చు..మీ సోదరి కదా అనొచ్చు. ఆమెను మీకు దత్తతు ఇస్తాం తీసుకోండని చెప్తున్నాను. – రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న పొరపొచ్చాలు వచ్చినట్లు నటిస్తాం కానీ, అవన్నీ నిజం కాదు. – మా అన్న, నా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. – ఈ విషయం తెలియని ప్రశాంతి రెడ్డి గారు ఫిబ్రవరి 16వ తేదీన నాకు ఫోన్ చేశారు. – టీడీపీ అధిష్టానం నా వెనుకపడుతున్నారు..కోవూరు నియోజకవర్గంలో పోటీ చేయమంటున్నారు..నువ్వేమంటావు అని అడిగారు. – అన్న మీద పోటీ చేసేటప్పుడు నా అభిప్రాయం కోరి, నా మద్దతు కోరడం కోసమే ఆమె నాకు ఫోన్ చేశారు. – ప్రశాంతి రెడ్డి గారి అంతర్గత మనస్థత్వం మాకు పూర్తిగా విరుద్ధం. – సోమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిగా మారారు. – ఆమె అర్ధం పర్ధం లేకుండా, ఆలోచన రహితంగా అమాకత్వమైన మనస్థత్వంతో ఎలా రాజకీయాల్లోకి వచ్చింది? – టీడీపీ, వైయస్ఆర్‌సీపీ నాయకులను ఆమె చిన్న చూపు చూసి, ఆ తర్వాత వారిని కరివేపాకులా పారేసింది. – తొలుత పుల్లారెడ్డి దినేష్ కుమార్ రెడ్డి గురించి మాట్లాడింది. ఆ పదాలు మీరు విన్నారంటే అమెను ఎలా గెలిపిస్తారో మీరే నిర్ణయించుకోండి. – ఆనం రాంనారాయణ రెడ్డి గారూ..మీ గురించి ఆమె ఎంత చీప్ గా మాట్లాడారో, మీరు పదివేల ఓట్లతో ఓడిపోతారని బహిర్గతంగా నాతో చెప్పింది. – చంద్రమోహన్ రెడ్డి.. సర్వేపల్లిలో ఓడిపోతారని, తనను సర్వేపల్లిలో పోటీచేయమన్నారని చెప్పారు. – విధిలేని పరిస్థితుల్లో ఎవరూ లేనప్పుడు, ఆయనకే ఇస్తారు కదా అని మీ గురించి చులకనగా మాట్లాడారు. – సోమిరెడ్డి కుటుంబ అనుమతితో నేను వివాహం చేసుకున్నాను అని చెప్పిన ప్రశాంతిరెడ్డి, అదే చంద్రమోహన్ రెడ్డి గురించి చులకనగా మాట్లాడారు. – వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి గురించి కూడా మాట్లాడింది. అవి వింటే నా తలతిరిగిపోయింది. – ఇంత అవమానం జరిగిన తర్వాత మనం తెలుగుదేశంలోకి వెళ్దామని, ఓడిపోతే క్విట్ అవుదామని అన్నాడని చెప్పారు. – ఇప్పుడు నేను కోవూరు వదిలిపెట్టి పోను అంటున్నారు. మరి క్విట్ అవుదాం అన్న దానికి సమాధానం ఏంటి? – వైఎస్సార్సీపీ నాయకుల గురించి కూడా దారుణంగా మాట్లాడింది. ఆదాల ప్రభాకర్ ప్యాకేజీకి వెళ్లిపోయాడు అన్నారు. – రామిరెడ్డి ప్రతాప్‌రెడ్డిని ‘వాడా’ అని సంభోదిస్తూ నాతో మాట్లాడింది. – ఇంత రాజకీయ పరిజ్ఞానం లేకుండా, నిన్న గాక మొన్న రాజకీయాల్లోకి వచ్చి, అనుభవం ఉన్న నాయకుల గురించే ఇలా మాట్లాడితే, రేపు మీరు గెలిస్తే ప్రజల పరిస్థితి ఏంటి? – నేను చెప్పేవి తప్పని మీరు జొన్నవాడ కామాక్షమ్మ సాక్షిగా ప్రమాణం చేసి చెప్పండి. మీరు ఏది చెప్తే అది చేస్తా. – రాజకీయ కుటుంబాల్లో అన్నదమ్ముల మధ్య విభేదాలు ఉన్నట్లు కనిపించవచ్చు కానీ..అవి విభేదాలు కాదు. – మేమే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంటికి కొంతమంది నాయకులను కోవర్టులుగా పంపించాం. – మాకు ఆస్తుల గొడవలు లేవు...ఎలాంటి విభేదాలు లేవు. – ఒక రాజకీయ అనుభవం కలిగిన కుటుంబం నుంచి వచ్చిన తర్వాత ఇలాంటివి ఉంటాయి. నా తమ్ముడికి ప్రశాంతిరెడ్డి రూ.3 కోట్లు ఆఫర్ చేసిందిః ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి: – వేమిరెడ్డి కుటుంబం, వాళ్ల స్వార్ధం కోసం పార్టీ వీడి వెళ్లారు. వాళ్లు ఎలాంటి లబ్ధిపొందారో వివరిస్తాం. – నా తమ్ముడికి, నాకు మనస్పర్ధలు ఉన్నాయని ఆమె స్వయంగా ఫోన్ చేసి రూ.3 కోట్లు ఆఫర్ చేసి టీడీపీలోకి రమ్మని అడిగారు. – కుటుంబం అయినా, పార్టీ అయినా చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి. మేమిద్దరం కూర్చుని మాట్లాడుకున్నాం. – ఆత్మకూరులో రాంనారాయణరెడ్డి గారు పదివేలతో ఓడిపోతున్నారని ప్రశాంతి రెడ్డి చెప్పారు. – కావలిలో ‘వాడు’ ప్రతాప్‌రెడ్డి అని మర్యాద, గౌరవం కూడా లేకుండా మాట్లాడింది. – ఇక చంద్రమోహన్‌రెడ్డి గురించి ఏం మాట్లాడారో మీరు విన్నారు. – మీరే చెప్పండి. ఈమెను రాజకీయ నాయకురాలు అంటామా? కోటీశ్వరురాలు అంటామా? నడమంత్రపు సిరి అంటామా? – నేనైతే నడమంత్రపు సిరే అంటాను. మధ్యలో డబ్బు వచ్చింది..దానితో పాటు అహంభావం, అహంకారం వచ్చేటట్లు చేస్తుంది డబ్బు. – ఆ పోగరుతోనే ఇవన్నీ మాట్లాడింది. ఇది కరెక్ట్ కాదు కదా? – రాజకీయ బలం కోసం కాదు..ఆమె నైజం, చరిత్ర బయటపెట్టాలని దీన్ని బయటకు తీసుకొచ్చాం. 100 కుటుంబాలు వైయస్ఆర్‌సీపీలో చేరిక వైయస్ఆర్‌సీపీ విధివిధానాల పట్ల ఆకర్షితులైన కోవూరు నియోజకవర్గం, ఇందుకూరుపేట మండలం, కుడితిపాలెం గ్రామానికి చెందిన 100 మందికి పైగా టీడీపీ, జనసేన పార్టీల కార్యకర్తలు ఎంపీ విజయసాయిరెడ్డి సమక్షంలో వైయస్ఆర్‌సీపీలో చేరారు. కోవూరు ఎమ్మెల్యే అభ్యర్ధి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తో కలిసి వారికి కండువా కప్పి విజయసాయిరెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు.