బెయిల్ వచ్చినంతమాత్రాన చంద్ర‌బాబు నిర్దోషి కాదు

వైయ‌స్ఆర్ సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి

మెడికల్‌ బెయిల్‌.. రెగ్యులర్‌ బెయిల్‌గా మారితే సత్యం గెలిచినట్లా..?

స్కిల్ స్కాంతో సంబంధం లేదని బాబు చెప్పడం లేదు

బాబు స్కాం చేసినట్టు ప్రైమా ఫేసీ ఉంది- ఆయనే సూత్రధారి

టెక్నికల్, హెల్త్ గ్రౌండ్స్ మీద బెయిల్ పొందాడు

ముమ్మాటికీ చంద్రబాబు డైరెక్షన్ లోనే స్కిల్ స్కాం.. ఫేక్ ఇన్వాయిస్ లతో రూ. 241 కోట్లు కొట్టేశారు

స్కిల్ కేసులో ఆధారాలన్నీ కోర్టు ముందుంచాం..

బెయిలిస్తే కేసు కొట్టేసినట్లు టీడీపీ హడావుడి-సంబరాలు. 

గుండె నొప్పి ఉంటే విజయయాత్రలెలా చేస్తాడు..?

చంద్రబాబు లోపలున్నా, బయట ఉన్నా.. మాకు ఒకటే

తాడేప‌ల్లి: చంద్రబాబుకు బెయిల్‌ రావడంతో ఎల్లో మీడియా హడావుడి చేస్తోందని, ​కోర్టు చేసిన వ్యాఖ్యలను ఎల్లో మీడియా చూపించడం లేదని, ప్రజలకు తప్పుడు సమాచారాన్ని ఇస్తోందని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి అన్నారు. మెడిక‌ల్ బెయిల్‌.. రెగ్యుల‌ర్ బెయిల్‌గా మారితే స‌త్యం గెలిచిన‌ట్లా అని ప్ర‌శ్నించారు. స్కిల్‌ స్కామ్‌తో సంబంధం లేదని చంద్రబాబు నిరూపించుకోవాలన్నారు. బెయిల్ వ‌చ్చినంత మాత్రాన చంద్ర‌బాబు నిర్దోషి కాద‌న్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ ఎలా జరిగిందో ఆధారాలున్నాయి. ఆధారాలన్నీ సీఐడీ తరపు లాయర్లు కోర్టులో సమర్పించారని చెప్పారు. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు.

సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..

చంద్రబాబుకు బెయిల్‌ రావడంపై ఊహించినట్లుగానే ఆ పార్టీ నేతలు, వారికి దిశానిర్ధేశం చేస్తున్న ఎల్లో మీడియా దీపావళి ఈ రోజే వచ్చిందన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. స్కిల్‌ కేసు కొట్టేసినట్లు ప్రజలకు వాళ్లు తప్పుడు మెసేజ్‌ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కోర్టు ఈ రోజు ఇచ్చిన బెయిల్‌ విషయంలో విశ్లేషణలు చేయాల్సిన అవసరం కూడా లేదు. వాళ్లు స్పందిస్తున్న తీరు వల్ల ప్రజలకు ఒక తప్పుడు సమాచారం వెళ్లే అవకాశం ఉంది. సెప్టెంబర్‌ 9వ తేదీన అరెస్టు, ఆ తర్వాత ఆయన జ్యుడిషియరీ కస్టడీకి వెళ్లినప్పటి నుంచీ ఈ స్కాం గురించి వారు మాట్లాడటం లేదు. కేసు వివరాలను న్యాయవాదులు చెప్తున్నారు...మేమూ వివరిస్తూనే ఉన్నాం. ఇది రాజకీయ కక్ష అంటూ టీడీపీ వాళ్ళు  దుష్ప్రచారం చేస్తున్నా..  ఎప్పటికప్పుడు మేం తిప్పికొడుతూ ఆధారాలన్నీ చూపించాం. అవన్నీ ఈ రోజుకీ మారలేదు..కేసూ అలానే ఉంది. చంద్రబాబు అరెస్ట్‌ చేయకపోతే ఏమవుతుంది అనేది ఆయన అరెస్ట్‌కు మూడు రోజుల ముందే రాష్ట్రమంతా చూసింది. 

బాబు బయట ఉంటే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు..
రూ.371 కోట్లు స్కిల్‌ డెవలెప్‌మెంట్‌ కార్పొరేషన్‌ నుంచి డిజైన్‌టెక్‌ కంపెనీకి వెళ్తే..దాంట్లో తలా తోక లేని షెల్‌ కంపెనీలకు రూ.241 కోట్లు క్యాష్‌గా మార్చి బయటకు పంపారు. 2018లో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే జీఎస్టీ విజిలెన్స్‌ అధికారులు స్పష్టంగా చెప్పారు. ఫేక్‌ ఇన్వాయిస్‌లు ద్వారా డబ్బు బయటకు వెళ్లిందని వారు ఇన్ఫార్మ్‌ చేశారు. బయటకు వెళ్లిన డబ్బు ఎక్కడకు వెళ్లింది అనేది తెలుసుకునే ప్రక్రియలో ఆగస్టులో చంద్రబాబుకి ఐటీ నోటీసు వచ్చినప్పుడు ఒక స్పష్టత వచ్చింది.  టిడ్కో ఇళ్లు, అమరావతి సెక్రటేరియట్‌ నిర్మాణంలో విపరీతంగా రేట్లు పెంచి...దాంట్లో మిగులు చంద్రబాబుకు ఇచ్చినట్లు మనోజ్‌ వాసుదేవ్ పార్ధసాని అనే వ్యక్తి తన వాగ్మూలంలో ఇచ్చారు. అక్కడ లింక్‌ దొరికింది...చంద్రబాబు చేసే అక్రమాల తీరేంటో స్పష్టంగా కనిపించింది. రూ.118 కోట్లు ఈ మనోజ్‌ అనే వ్యక్తి ద్వారా చంద్రబాబుకు చేరింది. చంద్రబాబుకు మనోజ్‌ను, ఆయన పీఏ పెండ్యాల శ్రీనివాస్‌ పరిచయం చేయడం, మా శ్రీనివాస్‌ ఏం చెబితే అది చేయండి అని చంద్రబాబు చెప్పాడు. మాకు ఎన్నికలు వస్తున్నాయి..డబ్బు డ్రా చేసి మాకివ్వాలని పీఏ శ్రీనివాస్‌ చెప్తాడు. కిలారు రాజేశ్, పెండ్యాల శ్రీనివాస్‌ ద్వారా ఆ డబ్బంతా ఇచ్చానని మనోజ్‌ పార్ధసాని స్పష్టంగా తన వాగ్మూలంలో చెప్పాడు. అది చూసిన తర్వాత పెండ్యాల శ్రీనివాస్, మనోజ్‌ పార్ధసానీ, కిలారు రాజేశ్‌లను నోటీసులిచ్చి రమ్మని సీఐడీ చెప్పింది. ఇలా నోటీసులివ్వగానే వారు దేశం విడిచి ఒకరు దుబాయి వెళ్లాడు..ఒకరు అమెరికా వెళ్లాడు. కిలారు రాజేశ్‌ పరారీలో ఉన్నాడు. దీన్ని చూసిన తర్వాత దీని వెనుక పెద్ద తలకాయ ఉందని, అది చంద్రబాబేనని ప్రైమాఫేసీ ఉన్నతర్వాత అరెస్ట్‌ చేశారు. 

నిరూపించుకోవాల్సిన బాధ్యత చంద్ర‌బాబుదే..
10వ తేదీన ఆయన్ను జ్యుడిషియల్‌ కస్టడీలోకి తీసుకున్నా ఆ తర్వాత చంద్రబాబును ప్రశ్నించగలిగింది కేవలం ఒక్కసారే. ఆ రోజు ఎప్పుడైతే జీఎస్టీ వద్ద నుంచి నోటీసు రాగానే రికార్డులన్నీ మాయం చేశారు.  షాడో ఫైల్స్‌లో సీఐడీ విచారణలో బయటపడింది సీఎం డైరెక్షన్‌ మేరకు నిధులు వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు వచ్చాయని చెప్పారు. అధికారులు వద్దన్నా సీఎం నేరుగా 13 చోట్ల సంతకాలు చేసి మరీ నిధులు విడుదల చేయించాడు. గంటా సుబ్బారావు అనే ఒక ప్రైవేటు వ్యక్తిని ఐదు పదవుల్లో కూర్చోపెట్టి అతని ద్వారా నిధులను బయటకు తీసుకెళ్లారు. ఈ స్కాం పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిన కుట్ర అనడానికి అన్ని ఆధారాలు కనిపిస్తున్నాయి. ఒక ప్రైవేటు వ్యక్తిని తీసుకొచ్చి ఐదు పదవులు ఇవ్వడం ఎక్కడైనా ఉందా? ఆ గంటా సుబ్బారావు ఫైనాన్స్‌ అధికారులకు కూడా డబ్బు విడుదల చేయాలంటూ ఆదేశాలిస్తాడు. చేసుకున్న ఒప్పందంలో డేట్, స్థలం కూడా ఉండదు. 90 శాతం సీమెన్స్ వాళ్ళు ఇవ్వాల్సిన నిధులపై అసలు ప్రస్తావనే ఉండదు. ఇది ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతుందా? దీన్ని స్కాం కాదనగలమా? ముఖ్యమంత్రి వద్ద నుంచే కుట్రకు బీజం పడి, ఆయన ఐడియా ప్రకారం, ఆయన చెబితేనే డబ్బు రిలీజ్‌ చేస్తున్నామన్న తర్వాత సంబంధం లేదంటే ఎలా? ఆయన హయాంలోనే రాత్రికి రాత్రి ఫైళ్లన్నీ తగలబెట్టి...నామ్‌ కే వాస్తే ఏసీబీ విచారణ వేశారు. సీమెన్స్‌ వాళ్ళు స్పష్టంగా.. తాము రూ.3వేల కోట్లు ఎక్కడి నుంచి తెస్తాం..ఎందుకు మేం ఇస్తాం అన్నారు. ఇంత జరిగినా అది స్కాం కాదు..దానిలో చంద్రబాబుకు ఏం సంబంధం అంటే దేనితో కొట్టాలి..? నాకు సంబంధం లేదు అని ప్రూవ్‌ చేసుకోవాల్సిన బాధ్యత చంద్రబాబుదే. 

రోగాలున్నాయని.. విజయఢంకా ఎలా మోగిస్తాడు?
73 ఏళ్ల ముసులాడు కాబట్టి, ఆరోగ్యం ఎప్పుడు ఏమవుతుందో తెలియదు కాబట్టి సింపతీగా చూడాలని వారే చెబుతారు. 73 ఏళ్ల ముసలాయనైనా సరే రెగ్యులర్‌ బెయిల్‌ రాగానే ఎక్కడైనా తిరగొచ్చట...ఇక విజయఢంకా మోగిస్తాడట అని వాళ్ళే మాట్లాడతారు. దేనికో ఒక దానికి స్టిక్‌ అయి ఉండాలిగా..? ఎక్కడ మొదలు పెట్టి ఎక్కడకు వచ్చారు..? ముందు క్వాష్‌ అన్నారు...అది సుప్రీంలో పెండింగ్‌లో ఉంది. ఆ తర్వాత రోగాలొచ్చాయి. తాత్కాలిక బెయిల్ ఇవ్వండి అని అడిగారు. వచ్చిన రోగాలు కూడా మామూలివి కాదు..గుండె జబ్బులతో సహా అన్నీ వచ్చాయి. మొన్న వాళ్లిచ్చిన మెడికల్ రిపోర్టులను చూస్తే అతను కదలకూడదు. వళ్లంతా రీబోర్‌ చేయించుకోవాలి. సర్జరీ చేయించుకోవాలి..కాన్సర్‌ కూడా ఉందో లేదో తేలాలంటున్నారు. మరి ఇంత అబద్ధమా..? ఇప్పుడు అదంతా తూచ్‌ అంటారా? నేడు కోర్టులో బెయిల్‌ రాగానే మీ నాయకుడు నిర్ధోషి అనుకుంటే పొరపాటే. కేసు క్లియర్‌గా ఉంది. దానికి తగిన ఆధారాలున్నాయి. ఇదొక్కటే కాదు..ఇంకా కేసులున్నాయి. ఫైబర్‌ నెట్‌ కేసు, ఓఆర్‌ఆర్‌ కేసు, అసైన్డ్‌భూముల కుంభకోణం, లిక్కర్‌ కేసు, ఇసుక కేసు..ఇలా అనేకం ఉన్నాయి. 

బాబు బయటున్నా..లోపలున్నా ఒకటే
వైయ‌స్ఆర్ సీపీకికి సంబంధించిన వరకూ చంద్రబాబు లోపలున్నా.. బయట ఉన్నా ఒకటే. బాబు బయట ఉండి జనంలోకి వస్తే మాకు అంత మేలు. 2014–19 మధ్య ఆయన ఏం చేశాడో ప్రజలకు సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఆయనేదో లోపలుంటే మాకేదో రాజకీయంగా మేలు జరుగుతుందనుకోవడం లేదు. కానీ చట్టపరంగా తాను చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు. ఎలాగూ తప్పించుకోలేడు. ఒక వేళ ఆయన జనంలోకి వస్తే ఇంకా మంచిది. 2014–19 మధ్య ఆయన చేసిన మోసం ఏంటో ప్రజలకు తెలియాలి. జైళ్లో కూర్చుని నేను లేస్తే మనిషిని కాదు అని చెప్పి తప్పించుకోడానికి అవకాశం లేకుండా ఇది కూడా మంచిదే. ఒక స్కాంస్టర్‌కి సంబంధించిన కేసు, ఇండియాలోనే ఒక క్లాసికల్‌ కేసుగా ఇది నిలుస్తుంది. ఇంతకాలం తప్పించుకు తిరిగిన ఒక ఘనుడి క్రిమినల్‌ చరిత్రకు సంబంధించిన ఈ స్కాం పూర్తిగా బయటకు వస్తుంది.. ప్రజలు తప్పుదోవపట్టాల్సిన అవసరం లేదు. 

హైకోర్టు తనకున్న విచక్షణతో న్యాయమూర్తి ఇచ్చిన బెయిల్‌ మాత్రమే. ఇన్నాళ్లలో ఎన్నడూ కేసు గురించి మాత్రం చంద్రబాబు మాట్లాడటం లేదు. తాను తప్పు చేయలేదని చెప్పలేదు. గంటా సుబ్బారావును ఎందుకు పెట్టుకున్నాం..నాకు సంబంధం లేదు అని కూడా అనడం లేదు. 17ఏ చూసి గవర్నర్‌ అనుమతి లేదంటాడు. రోగాల బారిన ఉన్న నన్ను దోమల మధ్య పడేశారు..కరుడు కట్టిన ఖైదీల మధ్య పడేశారని ఏడవడం చేశాడు. తప్పుడు రిపోర్టులతో వ్యవస్థలను మేనేజ్‌ చేసి జబ్బులున్నాయి...దయచూపండి అని వేడుకుని బయట పడాలని చూశాడు. మొత్తం మీద ఆయన కానీ...ఆయన పార్టీ కాని కేసుతో మాకు సంబంధం లేదు అని మాత్రం చెప్పడం లేదు. విచారణలో అన్నీ బయటకు వస్తాయి...రాజకీయంగా అతను బయట ఎంత తిరిగితే అంత మంచింది. అతనిలో ఉన్న డొల్ల తనం బయటపడుతుంది...మోసగాడు బయటకు వస్తాడు. ఇతను బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది కాబట్టి, అల్‌ రెడీ కొందరిని దేశం కూడా దాటించాడు కాబట్టి ఏమేం చేయాలో అవి విచారణ సంస్థలు చూసుకుంటాయి. 

చంద్రబాబుకు వచ్చిన బెయిల్ పై..  ఒక తప్పుడు ఇంప్రెషన్‌ ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తున్నారు. వాళ్లు మెయిన్‌ స్కిల్ స్కాం కేసు గురించి మాత్రం మాట్లాడం లేదు. మేం రెయిజ్‌ చేసిన ప్రశ్నలకు మాత్రం జవాబు ఇవ్వడం లేదు. బెయిల్‌ వస్తే సత్యం గెలిచిందా? వృద్ధుడు గుండెపోటుతో నేడో రేపో.. అన్నట్లున్న వ్యక్తి విజయఢంకా మోగించగలడా? మెడికల్‌ బెయిల్‌ను... రెగ్యులర్‌ బెయిల్‌గా మారిస్తే సత్యం గెలిచినట్లా? ఈ స్కాంపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తే చంద్రబాబు సూత్రధారి, పాత్రధారి అని తేలింది. ఈయన్ను కూర్చోబెట్టి ప్రశ్నిస్తే ఇంకా అన్ని విషయాలు తేలతాయి. ఈయన దేశం దాటించిన పెండ్యాల శ్రీనివాస్‌ను ప్రశ్నిస్తే మిగతావన్నీ తేలతాయి. సీఐడీ విచారణ చివరి అంకంలో ఉందని, బెయిల్‌ ఇవ్వొద్దని చెప్తున్నది అందుకే. బయట ఉన్న వాళ్లను తీసుకొచ్చేందుకు రాష్ట్రం- కేంద్రం సహకారం కూడా తీసుకోవచ్చు. విచారణ సంస్థకు ఉన్న అధికారాల మేరకు ఇప్పటికే ఈడీకి ఇచ్చారు..వారు నలుగురిని అరెస్ట్‌ కూడా చేశారు. ఈ రోజు బెయిల్‌ వచ్చింది కాబట్టి కేసంతా తప్పు అనడం అసంబద్ధం. 

తెలంగాణలో కాంగ్రెస్‌ను గెలిపించే ప్రయత్నం క్లియర్‌గా కనిపిస్తోంది. దాని కోసమే ఐటీ సభలు, ఇతరత్రా కార్యక్రమాలన్నీ చేశారు. అక్కడ పోటీకి దిగుతాడా అంటే దిగడం లేదు. తెరవెనుక అక్కడేం చేస్తున్నాడో మాకు అనవసరం. ఈ రాష్ట్రానికి సబంధించినంత వరకూ ఇక్కడ ప్లేయరా? అక్కడ ప్లేయరా? ఆయన ఇక్కడ ప్లేయర్‌ అయితే ఆయన గతంలో చెప్పిన మాయమాటలు, మళ్లీ ఎలాంటి మోసాలతో వస్తున్నాడో ప్రజలకు చెప్తాం. తన కంట్రోల్‌లో ఉన్న పవన్‌ కల్యాణ్‌ను అడ్డం పెట్టుకుని ఎలా వస్తున్నాడో చెప్తాం. 

Back to Top